2025-01-07 04:21:38.0
మోసం అనే గ్యారంటీ మాత్రమే అమలవుతోంది : కేటీఆర్
కాంగ్రెస్ అంటేనే కన్నింగ్ అని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మండిపడ్డారు. తెలంగాణలో ప్రజలకు ఆరు గ్యారంటీలు అమలు చేస్తామని చెప్పినా ఏడాదిలో మోసం అనే ఒకే ఒక్క గ్యారంటీ మాత్రమే అమలు చేస్తున్నారని ‘ఎక్స్’లో పోస్ట్ చేశారు. రైతు భరోసా విషయంలో కాంగ్రెస్ మోసాన్ని నిరసిస్తూ ఏఐసీసీ ఆఫీస్ ఎదుట రైతులు పోస్టర్లతో నిరసన తెలుపుతున్నారని పేర్కొన్నారు. రాహుల్ గాంధీ ఎందుకు తెలంగాణకు రావడం లేదని.. వరంగల్ రైతు డిక్లరేషన్ ఎంతవరకు అమలు చేశారో ఎందుకు ప్రజలకు, రైతులకు చెప్పడం లేదని నిలదీశారు. కాంగ్రెస్, హామీల్లో ఒక్క అర్ధ గ్యారంటీ అమలు చేస్తున్నారని.. మిగతా గ్యారంటీలకు అరవై షరతులు పెడుతున్నారని తెలిపారు. అబద్ధాల కాంగ్రెస్ లో అన్ని అరకొర గ్యారంటీలు, అర్ధసత్యాలేనని మండిపడ్డారు.
Congress Party,Warangal Farmer Declaration,Rythu Barosa,U Turn,KTR,BRS,KCR,Rahul Gandhi,Revanth Reddy