చెన్నమనేనికు హైకోర్టులో చుక్కెదురు

2024-12-09 06:58:15.0

బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే చెన్నమనేని రమేశ్‌కు తెలంగాణ హైకోర్టు షాకిచ్చింది. ఆయన జర్మనీ పౌరుడేనని తేల్చింది.

వేములవాడ మాజీ ఎమ్మెల్యే చెన్నమనేని రమేశ్‌కు తెలంగాణ హైకోర్టులో చుక్కెదురైంది. ఆయన జర్మనీ పౌరుడేనని తేల్చింది. జర్మన్ పౌరుడిగా కొనసాగుతూనే తప్పుడు పత్రాలతో ఎమ్మెల్యేగా గెలిచారని పేర్కొంది. ఆయన దాఖలు చేసిన పిటిషన్‌ను డిస్మిస్ చేసింది. కోర్టు విచారణ సందర్బంగా నకిలీ పత్రాలను సమర్పించారని ఆగ్రహం వ్యక్తం చేసింది. కోర్టును, ప్రజలను తప్పుదోవ పట్టించినందుకు 30 లక్షలు జరిమానా విధించింది.

అందులో రూ.25 లక్షలు కాంగ్రెస్ నేత ఆది శ్రీనివాస్ కు, మిగతా 5 లక్షలు లీగల్ సర్వీసెస్ అథారిటీకి నెల రోజుల్లోపు చెల్లించాలని ఆదేశించింది. చెన్నమనేని రమేశ్ బాబు జర్మన్ పౌరుడని, ఎమ్మెల్యేగా ఆయన ఎన్నిక చెల్లదంటూ కాంగ్రెస్ నేత ఆది శ్రీనివాస్ కోర్టును ఆశ్రయించారు. 2014లో బీఆర్ఎస్ పార్టీ తరఫున వేములవాడ నియోజకవర్గం నుంచి రమేశ్ బాబు అసెంబ్లీకి పోటీ చేయగా.. కాంగ్రెస్ నుంచి ఆది శ్రీనివాస్ పోటీ చేశారు. ఆ ఎన్నికల్లో ఆది శ్రీనివాస్ పై 5 వేల ఓట్ల మెజారిటీతో రమేశ్ బాబు గెలుపొందారు. దీనిపై ఆది శ్రీనివాస్ కోర్టుకెక్కారు.

https://www.teluguglobal.com//telangana/chennamaneni-will-be-sent-to-the-high-court-1088228Former MLA Chennamaneni Ramesh,Telangana High Court,German citizen,MLA Adi Srinivas,Vemulawada Constituency,KCR,BRS Party