https://www.teluguglobal.com/h-upload/2023/09/29/500x300_832616-amazon-flipkart.webp
2023-09-29 10:26:49.0
Amazon-Flipkart Bank Offers | గత నెలాఖరులో ఓనం వేడుకలతో దేశవ్యాప్తంగా పండుగల సీజన్ ప్రారంభమైంది. భారతీయులు పండుగల వేళలోనే తమ ఇంట్లో ఇష్టమైన.. అవసరమైన ముఖ్యమైన వస్తువులు కొనుగోలు చేస్తుంటారు.
Amazon-Flipkart Bank Offers | గత నెలాఖరులో ఓనం వేడుకలతో దేశవ్యాప్తంగా పండుగల సీజన్ ప్రారంభమైంది. భారతీయులు పండుగల వేళలోనే తమ ఇంట్లో ఇష్టమైన.. అవసరమైన ముఖ్యమైన వస్తువులు కొనుగోలు చేస్తుంటారు. గతంతో పోలిస్తే.. ఇప్పుడు గాడ్జెట్లు, లాప్‌టాప్‌లు, మినీ కంప్యూటర్లు, స్మార్ట్ ఫోన్లు.. స్మార్ట్ టీవీలు, టాబ్లెట్ల కొనుగోలుకు ప్రాధాన్యం ఇస్తున్నారు.
ఈ నేపథ్యంలో ప్రముఖ ఈ-కామర్స్ ప్లాట్ ఫామ్స్ అమెజాన్, ఫ్లిప్‌కార్ట్ వేర్వేరు ఆఫర్లతో ఫెస్టివ్ సేల్స్ అందుబాటులోకి తెచ్చాయి. అమెజాన్ గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ సేల్, ఫ్లిప్ కార్ట్ బిగ్ బిలియన్ డేస్ సేల్స్ అక్టోబర్ 8వ తేదీ నుంచి ప్రారంభం అవుతాయి. రెండు సంస్థలూ బ్యాంకు ఆఫర్లు, ఇతర డిస్కౌంట్లు ప్రకటించేశాయి. `అమెజాన్`స్ కిక్ స్టార్టర్ డీల్స్`, `ఫ్లిప్‌కార్ట్`స్ సేల్స్ ప్రైం లైవ్` ప్రమోషన్ల ద్వారా కస్టమర్లు తమకు ఇష్టమైన వస్తువుల కొనుగోళ్లకు ముందే ఈ డిస్కౌంట్లు పొందొచ్చు.
అమెజాన్, ఫ్లిప్‌కార్ట్ మీద గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ సేల్, బిగ్ బిలియన్ డేస్ సేల్‌లో డిస్కౌంట్లతోపాటు సెలెక్టెడ్ డెబిట్, క్రెడిట్ కార్డులు, పేటీఎం సహా యూపీఐ వాలెట్ల ద్వారా బుక్ చేసుకోవడం వల్ల అదనపు డిస్కౌంట్లు పొందొచ్చు. ఆన్‌లైన్ లావాదేవీల ద్వారా సేల్స్ ప్రారంభం కాకముందే అదనపు బెనిఫిట్లు అందుకోవచ్చు.
అమెజాన్ గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ సేల్‌లో ఎస్బీఐ డెబిట్ లేదా క్రెడిట్ కార్డులపై కొనుగోలు చేసే వారికి 10 శాతం ఇన్‌స్టంట్ డిస్కౌంట్ లభిస్తుంది. సంబంధిత స్మార్ట్ ఫోన్లు, ఎలక్ట్రానిక్ ఉపకరణాల కొనుగోళ్లపై ఎక్స్చేంజ్ డిస్కౌంట్లు కూడా పొందవచ్చు.
మీరు యాక్సిస్ బ్యాంక్ లేదా కొటక్ మహీంద్రా బ్యాంక్ లేదా ఐసీఐసీఐ బ్యాంక్ క్రెడిట్ కార్డు లేదా డెబిట్ కార్డు కలిగి ఉన్నారా.. అయితే ఫ్లిప్‌కార్ట్ బిగ్ బిలియన్ డేస్ సేల్స్‌లో 10 శాతం ఇన్‌స్టంట్ డిస్కౌంట్ పొందొచ్చు. స్మార్ట్‌ఫోన్, ఇతర ఉత్పత్తుల్లో పాత వాటి ఎక్స్చేంజ్ కోసం ఫ్లిప్‌కార్ట్ లేదా అమెజాన్‌లో ఎక్స్చేంజ్ బోనస్ ద్వారా కొత్త స్మార్ట్ ఫోన్ ఇతర ఎలక్ట్రానిక్ ఉపకరణాలు చౌక ధరకే పొందొచ్చు. ఫ్లిప్‌కార్ట్‌లో కొనుగోళ్లు జరిపితే కొన్ని సూపర్ కాయిన్స్ మీకు రివార్డ్స్‌గా అందిస్తుంది. తదుపరి కొనుగోళ్లలో ధర తగ్గించడానికి సూపర్ కాయిన్స్ ఉపకరిస్తాయి.
ప్రస్తుతం ఫెస్టివ్ సేల్స్ ఆఫర్స్.. అమెజాన్ ప్రైమ్ సబ్‌స్క్రైబర్లు, ఫ్లిప్‌కార్ట్ ప్లస్ సభ్యులకు మరింత ప్రయోజనం చేకూరుతుంది. అక్టోబర్ ఏడో తేదీ అర్థరాత్రి నుంచే ఆయా డిస్కౌంట్లు, డీల్స్, ఆఫర్లు వీరికి లభిస్తాయి.
Amazon Great Indian Festival Sale,Flipkart Big Billion Days Sale,Amazon,Flipkart,Bank Offers
amazon great indian festival sale,flipkart big billion days sale,amazon great indian festival,big billion days,great indian festival,amazon,flipkart,amazon sale,flipkart sale,sale offers, Bank Offers, అమెజాన్ ఫెస్టివల్, ఫ్లిప్‌కార్ట్ బిగ్ బిలియన్ సేల్స్, బ్యాంక్ ఆఫర్లు, పండుగల సీజన్
https://www.teluguglobal.com//business/amazon-great-indian-festival-sale-vs-flipkart-big-billion-days-sale-bank-offers-detailed-964562