Amazon Great Indian Festival Finale Days | అమెజాన్ గ్రేట్ ఇండియ‌న్ ఫెస్టివ‌ల్ ఫైన‌లే డేస్‌.. ఐ-ఫోన్ టు శాంసంగ్ వ‌ర‌కూ ఆక‌ర్ష‌ణీయ బ్యాంక్ ఆఫ‌ర్లు.. ఇవీ డిటైల్స్‌..!

https://www.teluguglobal.com/h-upload/2023/11/05/500x300_851428-amazon.webp

2023-11-05 07:09:51.0

Amazon Great Indian Festival Finale Days | ఈ-కామ‌ర్స్ జెయింట్ అమెజాన్‌.. పండుగ‌ల సంద‌ర్భంగా గ‌త నెల ఏడో తేదీ నుంచి వివిధ ఉత్ప‌త్తుల‌పై భారీ డిస్కౌంట్ల‌తో అమెజాన్ గ్రేట్ ఇండియ‌న్ ఫెస్టివ‌ల్ ఫైన‌లే డేస్ సేల్స్‌ ముగింపు ద‌శ‌కు వ‌చ్చింది.

Amazon Great Indian Festival Finale Days | ఈ-కామ‌ర్స్ జెయింట్ అమెజాన్‌.. పండుగ‌ల సంద‌ర్భంగా గ‌త నెల ఏడో తేదీ నుంచి వివిధ ఉత్ప‌త్తుల‌పై భారీ డిస్కౌంట్ల‌తో అమెజాన్ గ్రేట్ ఇండియ‌న్ ఫెస్టివ‌ల్ ఫైన‌లే డేస్ సేల్స్‌ ముగింపు ద‌శ‌కు వ‌చ్చింది. ఈ నెల ఒక‌టో తేదీన మొద‌లైన ఫైన‌లే డేస్ సేల్స్ ఈ నెల 10 వ‌ర‌కూ కొన‌సాగుతాయి. ఎలక్ట్రానిక్స్‌, ఫ‌ర్నీచ‌ర్‌, గృహోప‌క‌ర‌ణాలు, ఫ్యాష‌న్ ఉత్ప‌త్తులు త‌క్కువ ధ‌ర‌ల‌కే ఆఫ‌ర్ చేస్తోంది అమెజాన్.

వీటికి తోడు సెలెక్టెడ్ బ్యాంక్ డెబిట్, క్రెడిట్ కార్డుల‌తో జ‌రిపే కొనుగోళ్ల‌పై 10 శాతం ఇన్‌స్టంట్ బ్యాంక్ డిస్కౌంట్, ఐదు శాతం ఇన్‌స్టంట్ డిస్కౌంట్, ఐదు శాతం క్యాష్ బ్యాక్ ఆఫ‌ర్లు అందుబాటులో ఉన్నాయి.

ఐసీఐసీఐ డెబిట్ లేదా క్రెడిట్ కార్డుల‌తో కొనుగోలు చేసినా, క్రెడిట్ కార్డుతో ఈఎంఐ ఆప్ష‌న్ల‌తో కొన్నా 10 శాతం.. గ‌రిష్టంగా రూ.6,500 వ‌ర‌కూ ఇన్‌స్టంట్ డిస్కౌంట్ అందుకోవ‌చ్చు.

కొనుగోలుదారులు అమెజాన్ పే ఐసీఐసీఐ క్రెడిట్ కార్డుతో పే చేస్తే ఐదు శాతం ఇన్‌స్టంట్ డిస్కౌంట్‌, ఐదు శాతం క్యాష్ బ్యాక్ ఆఫ‌ర్లు పొందొచ్చు. బ్యాంక్ ఆఫ్ బ‌రోడా, ఐడీఎఫ్‌సీ ఫ‌స్ట్‌బ్యాంక్ క్రెడిట్ కార్డు యూజ‌ర్లు ఇన్‌స్టంట్ డిస్కౌంట్ రూపంలో రూ.5,000, రూ.6500 వ‌ర‌కూ రాయితీ పొందొచ్చు. ఒక‌వేళ వ‌న్ కార్డ్‌పై చెల్లింపుల‌కు ప‌ది శాతం.. గ‌రిష్టంగా రూ.8,250 వ‌ర‌కూ డిస్కౌంట్ అందుకోవ‌చ్చు.

ఎల‌క్ట్రానిక్ ఉత్ప‌త్తుల‌పై ఎక్స్చేంజ్ ఆఫ‌ర్లు కూడా ఉన్నాయి. అమెజాన్ గ్రేట్ ఇండియ‌న్ ఫెస్టివల్ ఫైన‌లే డేస్ డీల్ ధ‌ర‌, బ్యాంకు డిస్కౌంట్లు, ఎక్స్చేంజ్ ఆఫ‌ర్ క‌లుపుకుని సంబంధిత వ‌స్తువుల ధ‌ర‌లు దిగి వ‌స్తాయి. ఆక‌ర్ష‌ణీయ బ్యాంకు ఆఫ‌ర్ల‌తో ఆపిల్‌, వ‌న్‌ప్ల‌స్‌, శాంసంగ్ త‌దిత‌ర బ్రాండ్ల స్మార్ట్ ఫోన్లు రాయితీ అందుబాటులో ఉన్నాయి.

స్మార్ట్ ఫోన్ల‌పై ఆఫ‌ర్లు ఇలా..

స్మార్ట్ ఫోన్ —- —- —– — ఎంఆర్‌పీ — — త‌గ్గింపు ధ‌ర

ఐ-ఫోన్ 13 —– —– —- — రూ. 69,900 — — రూ. 55,999

వ‌న్‌ప్ల‌స్ నార్డ్ సీఈ3 —- — రూ. 28,998 — — రూ.24,499

శాంసంగ్ గెలాక్సీ ఎం 34 — రూ. 24,999 — — రూ.14,999

ఐక్యూ జ‌డ్ 7ఎస్ —- —- — రూ. 23,999 — — రూ.14,999

శాంసంగ్ గెలాక్సీ ఎం 14 — రూ.17,990 — —- రూ.10,490

లావా అగ్ని2 5జీ —- —- — రూ.25,999 — —- రూ.17,999

రియ‌ల్‌మీ నార్జో ఐ ప్రైమ్ — రూ.9,999 —- — రూ.6,569

రెడ్‌మీ నోట్ 12 —- —- —– రూ.18,999 — — రూ.10,499

వ‌న్‌ప్ల‌స్ 11 ఆర్ 5జీ —- —– రూ. 39,999 —— రూ. 37,999

టెక్నో పోవా5ప్రో 5జీ — —– రూ.19,999 — — రూ.12,299

Amazon Great Indian Festival Sale,Amazon,Best Deals,iPhone 13,OnePlus

https://www.teluguglobal.com//science-tech/amazon-great-indian-festival-finale-days-big-deals-on-iphone-13-oneplus-nord-ce-3-samsung-galaxy-m34-more-972213