Anupama Parameswaran – పరదా మాటున హీరోయిన్

 

2024-04-27 10:30:28.0

https://www.teluguglobal.com/h-upload/2024/04/27/1322663-paradha-anupama-1.webp

Anupama Parameswaran – టిల్లూ స్క్వేర్ తో సూపర్ హిట్ కొట్టిన అనుపమ, ఇప్పుడు పరదా సినిమాతో మరో కొత్త పాత్రలోకి మారింది.

“సినిమా బండి”తో ప్రశంసలు అందుకున్న దర్శకుడు ప్రవీణ్ కాండ్రేగుల తన రెండవ చిత్రంతో మరో డిఫరెంట్ పాయింట్ ఎంచుకున్నాడు. కథానాయికల చుట్టూ తిరిగే ఈ చిత్రంలో వెరీ ట్యాలెంటెడ్ అనుపమ పరమేశ్వరన్, వెర్సటైల్ దర్శనా రాజేంద్రన్, ప్రముఖ నటి సంగీత ప్రధాన పాత్రలు పోహిస్తున్నారు. ఆకట్టుకునే డ్రామాతో రూపొందుతున్న ఈ చిత్రానికి “పరదా” అనే ఆసక్తికరమైన టైటిల్ పెట్టారు.

పరదా అంటే కర్టెన్. పరదా లేకుండా అనుపమ కనిపించిన ఫస్ట్ లుక్ పోస్టర్ అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. అనుపమ సాంప్రదాయ దుస్తుల్లో ఉండగా..మిగతా అమ్మాయిలు కొంగుతో తమ ముఖాన్ని కప్పుకొని నిల్చున్నారు. అనుపమ తీక్షణంగా చూస్తూ, డీ-గ్లామరస్ పాత్రలో కనిపిస్తోంది.

కాన్సెప్ట్ వీడియో విలేజ్ సెటప్‌లో దేవత విగ్రహాన్ని చూపుతుంది. ఎక్కడ స్త్రీలు గౌరవించబడతారో, అక్కడ దేవతలు పూజింపబడతారు అనే సంస్కృత శ్లోకంతో టైటిల్ మోషన్ పోస్టర్ రిలీజ్ చేశారు. ఎన్నో ప్రశంసలు పొందిన ‘హృదయం’, ‘జయ జయ జయ జయ హే’ చిత్రాలలో పాపులరైన తర్వాత దర్శన రాజేంద్రన్ పరదా చిత్రంతో తెలుగు సినిమాల్లోకి ఎంట్రీ ఇస్తోంది.

ఢిల్లీ, హిమాచల్ ప్రదేశ్, కొన్ని గ్రామాలలోని అద్భుతమైన ప్రదేశాలలో పరదా షూటింగ్ జరిగింది. వచ్చే నెలలో హైదరాబాద్‌లో ఫైనల్ షెడ్యూల్ ఉంటుంది. గోపీసుందర్ ఈ సినిమాకు సంగీత దర్శకుడు.

 

Anupama Parameswaran,Paradha,Sangeetha,Praveen Kandregula