August 15 Movies | ఆగస్ట్ 15 సినిమాల జాతకాలు

 

2024-08-17 16:35:43.0

https://www.teluguglobal.com/h-upload/2024/08/17/1353034-august-15.webp

August 15 Releases – ఆగస్ట్ 15కి 4 సినిమాలు రిలీజ్ అయ్యాయి. వాటిలో 2 సినిమాలపై భారీ అంచాలున్నాయి. మరి ఆ సినిమాల రిజల్ట్ ఏంటి?

ఎన్నో నెలల గ్యాప్ తర్వాత టాలీవుడ్ బాక్సాఫీస్ లో పండగ వాతావరణం కనిపించింది. దీనికి కారణం ఆగస్ట్ 15 సెలవు దినం, అలా కలిసొచ్చిన లాంగ్ వీకెండ్. దేశమంతా సెలబ్రేషన్ మూడ్ లో ఉంటుంది. సినిమా రిలీజ్ కు సరైన టైమ్.

అందుకే టాలీవుడ్ లో గట్టి పోటీ నడిచింది. ఏకంగా 4 సినిమాలొచ్చాయి. మరి వాటి ఫలితాలేంటి? భారీ అంచనాల మధ్య వచ్చింది మిస్టర్ బచ్చన్ సినిమా. రవితేజ, హరీశ్ శంకర్ కాంబోలో వచ్చిన ఈ సినిమాకు మొదటి రోజే మిక్స్ డ్ టాక్ వచ్చేసింది. తొలి రోజు 8 కోట్ల గ్రాస్ వచ్చినప్పటికీ, నిలబడుతుందా లేదా అనేది అప్పుడే చెప్పలేం.

ఇక డబుల్ ఇస్మార్ట్ ది కూడా ఇదే పరిస్థితి. రామ్-పూరి కాంబోలో వచ్చిన ఈ సినిమాకు కూడా మిక్స్ డ్ టాక్ నడుస్తోంది. అలీ కామెడీ ట్రాక్ అయితే పరమ రోత. మొదటి రోజు 12 కోట్ల రూపాయలకు పైగా గ్రాస్ వచ్చింది. ఆదివారం గడిస్తే తప్ప రిజల్ట్ చెప్పలేం.

ఇక చిన్న సినిమాగా వచ్చిన ఆయ్ మాత్రం మంచి కామెడీతో మెప్పించింది. కానీ స్టార్ ఎట్రాక్షన్ లేని ఈ సినిమాను చూసేందుకు ఆడియన్స్ డబ్బులు ఖర్చుపెట్టి థియేటర్లకు వస్తారా అనేది అందరి సందేహం. ఇటు విక్రమ్ నటించిన తంగలాన్ సినిమా మొదటిరోజే తెలుగులో ఫ్లాప్ అయింది. సెకండాఫ్ అయితే మరీ స్లోగా ఉంది. 

 

August 15,Thangalaan,Mr Bachchan,Double iSmart