Avatar 3 | అవతార్-3 కొత్త టైటిల్

 

2024-08-11 05:28:14.0

https://www.teluguglobal.com/h-upload/2024/08/11/1351462-avatar-3.webp

Avatar 3 – జేమ్స్ కామరూన్ అద్భుత సృష్టి అవతార్. ఇప్పటికే 2 భాగాలు సక్సెస్ అయ్యాయి. ఇప్పుడు పార్ట్-3కి టైటిల్ ఫిక్స్ చేశారు.

ప్రపంచం మెచ్చిన దిగ్గజ దర్శకుడు జేమ్స్ కామరూన్, అవతార్ మూడో పార్ట్ తో బిజీగా ఉన్నాడు. ఇప్పటికే 2 భాగాలు విడుదలై సంచలన విజయం సాధించాయి. ఇప్పుడు మూడో భాగం వేగంగా సిద్ధమౌతోంది. తాజాగా అవతార్-3కి టైటిల్ ఫిక్స్ చేశారు. ఈ సినిమాకు ఫైర్ అండ్ యాష్ అనే పేరు పెట్టారు.

మొదటి సినిమా అవతార్, 2009లో వచ్చింది. రికార్డులు సృష్టించింది. ఆ తర్వాత 13 ఏళ్లకు 2022లో అవతార్ 2 – ది వే ఆఫ్ వాటర్ వచ్చింది. ఇది కూడా అద్భుత విజయాన్ని సాధించింది. అయితే ఈసారి అవతార్-3కి అంత గ్యాప్ తీసుకోవడం లేదు దర్శకుడు. వచ్చే ఏడాది, అంటే 2025 డిసెంబర్ 19కే ఫైర్ అండ్ యాష్ మూవీ థియేటర్లలోకి వస్తుందని ప్రకటించాడు.

అవతార్ ఫ్రాంచైజీని మొత్తం 5 భాగాలుగా తీసుకురాబోతున్నట్టు ఇదివరకే నిర్మాణ సంస్థ ప్రకటించిన సంగతి తెలిసిందే. నాలుగో భాగం 2027లో, ఐదో భాగం 2029లో థియేటర్లలోకి వస్తాయి. నిజానికి ఈ సినిమాలన్నీ ఇంకాస్త ముందే రిలీజ్ కావాల్సి ఉండగా.. కరోనా వల్ల విడుదల తేదీల్లో మార్పులు చోటు చేసుకున్నాయి.

2029తో అవతార్ ఫ్రాంచైజీ ముగుస్తుందని తెలిపాడు కామరూన్. “అవతార్” పార్ట్ 1, పార్ట్ 2 బాక్సాఫీస్ వద్ద అఖండ విజయాన్ని సాధించాయి. హాలీవుడ్‌లో అత్యధిక వసూళ్లు రాబట్టిన సినిమా ఇప్పటికీ అవతార్-1 మాత్రమే. ఇప్పటివరకు ఆ సినిమాను ఏదీ క్రాస్ చేయలేకపోయింది. 

 

Avatar 3,Avatar 3 Title,Fire and Ash,James Cameron