Balagam movie | మరోసారి వార్తల్లోకి బలగం

 

2024-07-17 06:21:10.0

https://www.teluguglobal.com/h-upload/2023/04/03/729450-balagam.webp

Balagam movie – బలగం మూవీ మరో ఘనత సాధించింది. ఫిలింఫేర్ అవార్డుల్లో ఏకంగా 7 నామినేషన్లు దక్కించుకుంది.

టాలీవుడ్ చరిత్రలో నిలిచిపోయే చిత్రం బలగం. ఇన్నాళ్లూ నటుడిగానే పరిచయమైన వేణు, దర్శకుడిగా బలగం అనే అద్భుతమైన సినిమా తీశాడు. మనుషుల మధ్య బంధాల్ని, మానవ సంబంధాల్ని మనసుకు హత్తుకునేలా, అత్యంత హృద్యంగా వేణు తీసిన ఈ సినిమా ప్రేక్షక లోకాన్ని కదిలించింది. కాసులతో పాటు, క్రిటిక్స్ మెప్పు పొందింది.

ఇది 2023 ఉత్తమ చిత్రాలలో ఒకటి. అంతేకాదు, టాలీవుడ్ లో క్లాసిక్ అనిపించుకుంది. ఈ ఒక్క సినిమాతో వేణు ఇమేజ్ మారిపోయింది, కమెడియన్ స్థాయి నుంచి అందరూ గౌరవించే స్థాయికి ఎదిగాడు వేణు. ఈ చిత్రం ఇప్పటికే వందకు పైగా అంతర్జాతీయ అవార్డులు అందుకుంది.

ఇప్పుడు మరో అవార్డ్ ఫంక్షన్ లో కూడా మెరిసేందుకు సిద్ధమైంది. 2024 ఫిలింఫేర్ అవార్డుల్లో సత్తా చాటడానికి సిద్ధమౌతోంది బలగం. ఈ మేరకు ప్రకటించిన నామినేషన్లలో బలగం సినిమాకు ఏకంగా 7 నామినేషన్లు దక్కాయి.

ఉత్తమ చిత్రం, ఉత్తమ దర్శకుడు విభాగాలతో పాటు.. బెస్ట్ సపోర్టింగ్ రోల్ మేల్, బెస్ట్ మ్యూజిక్ ఆల్బమ్, బెస్ట్ లిరిసిస్ట్, బెస్ట్ ప్లే బ్యాక్ సింగర్ మేల్ (కాసర్ల శ్యామ్), బెస్ట్ ప్లేబ్యాక్ సింగర్ ఫిమేల్ (మంగ్లీ) విభాగాల్లో బలగం సినిమా నామినేట్ అయింది. వీటిలో కనీసం 5 విభాగాల్లో అవార్డులు గ్యారెంటీ అనే అంచనాలున్నాయి. 

 

Balagam movie,Filmfare Awards,7 nominations,Priyadarshi,Director Venu