2024-06-10 17:45:55.0
https://www.teluguglobal.com/h-upload/2024/06/10/1335173-balakrishna-boyapati.webp
Balakrishna Boyapati – బాలకృష్ణ-బోయపాటి మరోసారి చేతులు కలిపారు. నాలుగో సినిమా చేస్తున్నారు.
నందమూరి బాలకృష్ణ, బ్లాక్‌బస్టర్ మేకర్ బోయపాటి శ్రీను హ్యాట్రిక్ బ్లాక్‌బస్టర్‌లను పూర్తి చేసి ఇండియన్ సినిమా క్రేజీ కాంబినేషన్‌లలో ఒకటిగా నిలిచారు. అత్యధిక వసూళ్లు రాబట్టిన సింహా, లెజెండ్, అఖండ చిత్రాలతో హ్యాట్రిక్ బ్లాక్‌బస్టర్‌లను అందించిన తర్వాత ఈ కాంబో మళ్లీ చేతులు కలిపింది.
వీరిద్దరూ నాలుగోసారి జత కడుతున్నారు. బాలకృష్ణ, బోయపాటి శ్రీను కాంబినేషన్‌లో చిత్రాన్ని, ఈ రోజు బాలకృష్ణ పుట్టినరోజు సందర్భంగా అఫీషియల్ గా అనౌన్స్ చేశారు. ‘లెజెండ్’ సినిమా నిర్మాణ భాగస్వాములైన రామ్ ఆచంట, గోపీచంద్ ఆచంట 14 రీల్స్ ప్లస్ బ్యానర్‌పై ఈ భారీ చిత్రాన్ని నిర్మించనున్నారు. బాలకృష్ణ కూతురు తేజస్విని నందమూరి ఈ చిత్రానికి ప్రజెంటర్.
బాలకృష్ణ, బోయపాటి తెలుగు సినిమాలో బెంచ్‌మార్క్‌ను సెట్ చేశారు. ఈ డెడ్లీ కాంబినేషన్‌లో వస్తున్న మోస్ట్ ఎవైటెడ్ మూవీ హై బడ్జెట్, టాప్ క్లాస్ టెక్నికల్ వాల్యూస్ తో వస్తోంది.
ప్రస్తుతం బాబి దర్శకత్వంలో సితార ఎంటర్ టైన్ మెంట్స్ బ్యానర్ పై ఓ సినిమా చేస్తున్నాడు బాలయ్య. ఇంకా పేరు పెట్టని ఆ సినిమా షూటింగ్ ఓ కొలిక్కి వచ్చిన వెంటనే బోయపాటితో కలిసి సెట్స్ పైకి వెళ్తాడు.
Balakrishna,boyapati,4th movie,14 reels plus