https://www.teluguglobal.com/h-upload/2023/08/14/500x300_810187-suvs.webp
2023-08-14 11:13:15.0
Best Selling SUV Cars | రోజురోజుకు ఎస్‌యూవీ కార్లకు గిరాకీ పెరుగుతోంది. గతేడాదితో పోలిస్తే ఎస్‌యూవీ కార్ల సేల్స్ జూలైలో లక్షకుపైగా జరిగాయి. వాటిల్లో మారుతి సుజుకి బ్రెజా మొదటి స్థానంలో నిలిచింది. హ్యుండాయ్ క్రెటా, మారుతి ఫ్రాంక్స్ తర్వాతీ స్థానాల్లో నిలిచాయి.
Best Selling SUV Cars | కరోనా తర్వాత ప్రతి ఒక్కరూ పర్సనల్ మొబిలిటీకి ప్రాధాన్యం ఇస్తున్నారు. అందునా స్పేసియస్‌గా ఉన్న స్పోర్ట్ యుటిలిటీ వెహికల్స్ (ఎస్‌యూవీ) కార్లపై మోజు పెంచుకున్నారు. వాటిలో మారుతి సుజుకి బ్రెజా, హ్యుండాయ్ మోటార్ ఇండియా క్రెటా, టాటా నెక్సాన్, కియా సెల్టోస్ మోడల్స్ టాప్-10 ఎస్‌యూవీల్లో నిలిచాయి. గత నెలలో 3.52 లక్షల కార్లు అమ్ముడయ్యాయి. గతేడాదితో పోలిస్తే మూడు శాతం, జూన్ నెలతో పోలిస్తే 7.4 శాతం కార్ల విక్రయాలు పెరిగాయి. వాటిల్లో ఎస్‌యూవీ కార్లదే అగ్రతాంబూలం.
2023 జూలైలో అమ్ముడైన ఎస్‌యూవీ కార్లలో మారుతి సుజుకి బ్రెజా టాప్‌లో నిలిచింది. గత నెలలో 16,543 కార్ల విక్రయంతో బ్రెజా సబ్-కంపాక్ట్ ఎస్‌యూవీ మొదటి స్థానంలో నిలిచింది. 2022తో పోలిస్తే బ్రెజా కార్ల సేల్స్ 70 శాతం వృద్ధి చెందాయి. ఇటీవలే మార్కెట్లోకి ఎంటరైన మారుతి సుజుకి ఫ్రాంక్స్ 13 వేలకు పైగా అమ్ముడయ్యాయి.
ఇక టాటా మోటార్స్ వారి టాటా నెక్సాన్, టాటా పంచ్ 12 వేలకు పైగా యూనిట్లతో మూడవ, నాల్గవ స్థానంలో నిలిచాయి. రెండో స్థానంలో నిలిచిన హ్యుండాయ్ క్రెటా 14,062 యూనిట్లు విక్రయించింది. తర్వాతీ స్థానాల్లో మహీంద్రా స్కార్పియో (ఎన్+ క్లాసిక్), హ్యుండాయ్ వెన్యూ, కియా సెల్టోస్, మారుతి సుజుకి గ్రాండ్ విటారా నిలిచాయి. ఇటీవలే మార్కెట్లోకి ఎంటరైన హ్యుండాయ్ ఎక్స్‌టర్ 7000 యూనిట్ల సేల్స్‌తో టాప్-10 కార్లలో చివరి స్థానం దక్కించుకున్నది.
గత నెలలో బెస్ట్ సెల్లింగ్ ఎస్‌యూవీలు ఇవే..
బెస్ట్ మోడల్ కారు పేరు —————– జూలై 2023 సేల్స్ —– జూలై 2022 సేల్స్ —— వృద్ధిరేటు
మారుతి సుజుకి బ్రెజా ——————– 16,543 ——————— 9,709 ——————– 70 శాతం
హ్యుండాయ్ క్రెటా ———————— 14,062 ——————— 12,625 ——————- 11 శాతం
మారుతి సుజుకి ఫ్రాంక్స్ —————– 13,320 ————————————————————–
టాటా నెక్సాన్ —————————— 12,349 ——————— 14,214 ——————– -13శాతం
టాటా పంచ్ ——————————– 12,019 ——————— 11,007 ———————- 9 శాతం
మహీంద్రా స్కార్పియో (ఎన్+క్లాసిక్) — 10,522 ——————— 3,803 ———————– 177 శాతం
హ్యుండాయ్ వెన్యూ———————— 10,062 ——————— 12,000 ——————— -16 శాతం
కియా సెల్టోస్ ——————————– 9,740 ——————— 8,541 ———————– 14 శాతం
మారుతి సుజుకి గ్రాండ్ విటారా ———– 9,079 ————————————————————–
హ్యుండాయ్ ఎక్స్‌టర్ ———————- 7,000 ————————————————————–
Best Selling SUV Cars | రోజురోజుకు ఎస్‌యూవీ కార్లకు గిరాకీ పెరుగుతోంది. గతేడాదితో పోలిస్తే ఎస్‌యూవీ కార్ల సేల్స్ జూలైలో లక్షకుపైగా జరిగాయి. వాటిల్లో మారుతి సుజుకి బ్రెజా మొదటి స్థానంలో నిలిచింది. హ్యుండాయ్ క్రెటా, మారుతి ఫ్రాంక్స్ తర్వాతీ స్థానాల్లో నిలిచాయి.
SUV,SUV Car Sales,Cars,Maruti Suzuki Brezza,Hyundai Creta,Maruti Suzuki Fronx,Tata Nexon
SUV sales in July, Top 10 selling SUVs, Maruti Suzuki Brezza, Hyundai Creta, Maruti Suzuki Fronx, Tata Nexon, Tata Punch, Mahindra Scorpio, Hyundai Venue, Kia Seltos, Maruti Suzuki Grand Vitara, Mahindra Bolero
https://www.teluguglobal.com//business/top-10-best-selling-suvs-in-india-for-july-2023-brezza-beats-creta-nexon-955104