Big B Rajini | 33 ఏళ్ల తర్వాత కలిసిన సూపర్ స్టార్లు

 

2024-05-04 08:06:22.0

https://www.teluguglobal.com/h-upload/2024/05/04/1324700-amitabh-rajinikanth-1.webp

Amitab Bachchan and Rajinikanth – 33 ఏళ్ల తర్వాత అమితాబ్ బచ్చన్, రజనీకాంత్ కలిసి నటిస్తున్నారు. ఆ వివరాలు మీకోసం..

ఇండియాలోనే అతిపెద్ద సూపర్ సూపర్ స్టార్లు రజనీకాంత్, అమితాబ్ బచ్చన్ కలిశారు. టీజే జ్ఞానవేల్ దర్శకత్వంలో వస్తున్న వేట్టయాన్ సినిమాలో వీళ్లిద్దరూ కలిసి నటిస్తున్నారు. ప్రస్తుతం ముంబయిలో బిగ్ బి, రజనీ మధ్య సన్నివేశాలు తీస్తున్నారు.

లొకేషన్ లో ఖరీదైన సూట్స్ ధరించి స్టయిలిష్ గా కనిపించారు బిగ్ బి, రజనీకాంత్. దీనికి సంబంధించిన స్టిల్స్ కూడా రిలీజయ్యాయి.

ఒక ఫోటోలో రజనీకాంత్, అమితాబ్ ఒకరినొకరు కౌగిలించుకున్నారు, మరొక ఫోటోలో వాళ్లు సుదీర్ఘ చర్చలో మునిగిపోయారు. ఈ చిత్రాలను లైకా ప్రొడక్షన్స్ షేర్ చేస్తూ.. “ ది టైటాన్స్ ఆఫ్ ఇండియన్ సినిమా! సూపర్‌స్టార్ రజినీకాంత్, షాహెన్‌షా అమితాబ్ బచ్చన్ వెట్టయన్ సెట్స్‌లో మెరిశారు” అంటూ ట్వీట్ చేసింది.

అమితాబ్ బచ్చన్, రజనీకాంత్ స్క్రీన్ షేర్ చేసుకోవడం ఇదే తొలిసారి కాదు. వీరిద్దరూ గతంలో అంధా కానూన్ (1983), గిరాఫ్తార్ (1985) సినిమాల్లో నటించారు. వీళ్లిద్దరూ కలిసి నటించిన చివరి చిత్రం 1991లో విడుదలైన హమ్.

 

Amitab Bachchan,Rajinikanth,new movie