https://www.teluguglobal.com/h-upload/2023/09/29/500x300_832468-bmw-ix1-ev.webp
2023-09-29 06:29:42.0
BMW iX1 EV | ప్రముఖ జర్మనీ కార్ల తయారీ సంస్థ బీఎండబ్ల్యూ (BMW) భారత్ మార్కెట్లో తొలి లగ్జరీ ఎలక్ట్రిక్ ఎస్‌యూవీ కారు ఐఎక్స్1 (iX1) ఆవిష్కరించింది.
BMW iX1 EV | ప్రముఖ జర్మనీ కార్ల తయారీ సంస్థ బీఎండబ్ల్యూ (BMW) భారత్ మార్కెట్లో తొలి లగ్జరీ ఎలక్ట్రిక్ ఎస్‌యూవీ కారు ఐఎక్స్1 (iX1) ఆవిష్కరించింది. దీని ధర రూ.66.90 లక్షలు (ఎక్స్ షోరూమ్)గా నిర్ణయించింది. ఐఎక్స్1 (iX1) ఎలక్ట్రిక్ ఎస్‌యూవీగా ఆవిష్కరించినా.. పెట్రోల్, డీజిల్, ఎలక్ట్రిక్ పవర్ ట్రైన్ ఆప్షన్లలో మార్కెట్‌లో ఆవిష్కరించిన తొలి కారు ఇదే. న్యూ ఐఎక్స్1 (iX1) కారు మాత్రం భారత్ మార్కెట్‌లో కంప్లీట్‌లీ బిల్ట్ యూనిట్ (సీబీయూ) మాత్రమే విక్రయిస్తామని గురువారం ప్రకటించింది. బీఎండబ్ల్యూ అధికారిక వెబ్‌సైట్ ద్వారా బుక్ చేసుకున్న వారికి అందుబాటులో ఉంటాయి ఈ ఐఎక్స్1 (iX1) కార్లు. అక్టోబర్ నుంచి బీఎండబ్ల్యూ ఐఎక్స్1 (BMW iX1) కార్ల డెలివరీ ప్రారంభం అవుతుంది.
సింగిల్ చార్జింగ్‌తో 440 కి.మీ దూరం ప్రయాణించగల సామర్థ్యం గల ఆల్ న్యూ బీఎండబ్ల్యూ ఐఎక్స్1 (BMW iX1) కారు ఎక్స్ డ్రైవ్ ఆల్ వీల్ డ్రైవ్ టెక్నాలజీ (xDrive all-wheel drive technology)తో వస్తోంది. కేవలం 5.6 సెకన్లలో 100 కి.మీ వేగంతో దూసుకెళ్లగల కెపాసిటీ గల ఫిప్త్ జనరేషన్ ఈడ్రైవ్ టెక్నాలజీ (eDrive technology)తో రూపుదిద్దుకున్నదీ కారు. అల్ఫైన్ వైట్ నాన్-మెటాలిక్, స్పేస్ సిల్వర్, బ్లాక్ సఫైర్, స్టోర్మ్ బే మెటాలిక్ కలర్ ఆప్షన్లలో లభిస్తుంది బీఎండబ్ల్యూ ఐఎక్స్1 (BMW iX1).

ఏడబ్ల్యూడీపై ప్రతి వీల్ చానెలింగ్‌కు వీలుగా డ్యుయల్ ఎలక్ట్రిక్ మోటార్లతో వస్తున్న ఐఎక్స్1 (iX1) కారులో 66.4 కిలోవాట్ల బ్యాటరీ ప్యాక్ ఉంటుంది. గంటకు 180 కి.మీ వేగంతో దూసుకెళ్లడం దీని స్పెషాలిటీ. ఈ కారు ఎలక్ట్రిక్ పవర్ ప్లాంట్ గరిష్టంగా 308 బీహెచ్పీ విద్యుత్, 494 ఎన్ఎం టార్క్ వెలువరిస్తుంది.
ఆల్ న్యూ బీఎండబ్ల్యూ ఐఎక్స్1 (BMW iX1) కారు ఫాస్ట్ చార్జింగ్ టెక్నాలజీతో వస్తున్నది. 130 కిలోవాట్ల డీసీ ఫాస్ట్ చార్జర్ సాయంతో 20 నిమిషాల్లో 10-80 శాతం బ్యాటరీ చార్జింగ్ చేయొచ్చు. 10 నిమిషాలు ఫాస్ట్ చార్జింగ్‌తో 120 కి.మీ దూరం ప్రయాణించవచ్చు. ఇక 11 కిలోవాట్ల ఏసీ చార్జర్‌తో బ్యాటరీ పూర్తిగా చార్జింగ్ కావడానికి సుమారు 6.3 గంటల సమయం పడుతుంది. బీఎండబ్ల్యూ ఐఎక్స్1 (BMW iX1) కారు రెండేండ్ల వరకూ స్టాండర్డ్ (అపరిమిత ప్రయాణం), ఎనిమిదేండ్లు లేదా 1.60 లక్షల కిలోమీటర్ల వరకూ బ్యాటరీ ప్యాకప్‌పై వారంటీ అందిస్తోంది.
బోల్డ్, మస్క్యులర్ డిజైన్‌తో వస్తోందీ ఎలక్ట్రిక్ లగ్జరీ ఎస్‌యూవీ కారు. సంప్రదాయ ఫ్యుయల్ పవర్డ్ ఎక్స్1కు భిన్నంగా రూపుదిద్దుకున్న బీఎండబ్ల్యూ ఐఎక్స్1 (BMW iX1) కారు స్క్వేర్ బీఎండబ్ల్యూ కిడ్నీ గ్రిల్లె విత్ గ్లోసీ బ్లాక్ ప్యానెల్ కలిగి ఉంటుంది. సెగ్మెంట్ ఫస్ట్ అడాప్టివ్ ఎల్ఈడీ హెడ్ లైట్స్, స్క్వేర్ వీల్ ఆర్చెస్, 18-అంగుళాల ఎం లైట్ అల్లాయ్ వీల్స్, బ్యాక్‌లో లార్జ్ సర్ఫేస్ డిఫ్యూజర్, ఎల్-షేప్డ్ ఎల్ఈడీ టెయిల్ లైట్స్ ఉంటాయి.
బీఎండబ్ల్యూ ఐఎక్స్1 (BMW iX1) కారు ఎం-స్పోర్ట్ లెథర్ గల స్టీరింగ్ వీల్, అంబియెంట్ లైటింగ్, డ్యూయల్ జోన్ ఏసీ, 12-స్పీకర్ ఆడియో సిస్టమ్, మల్టీపుల్ మెసేజ్ ఆప్షన్స్ ఫర్ ఫ్రంట్ సీట్స్, కారు క్యాబిన్‌లో ఫుల్లీ డిజిటల్ బీఎండబ్ల్యూ కర్వ్‌డ్ డిస్‌ప్లే, డ్యుయల్ జోన్ క్లైమేట్ కంట్రోల్, పనోరమిక్ సన్‌రూఫ్, కనెక్టెడ్ కార్ టెక్, డిజిటల్ కీ, వైర్‌లెస్ చార్జింగ్, ఆండ్రాయిడ్ ఆటో / ఆపిల్ కార్ ప్లే తదితర ఫీచర్లు ఉంటాయి.
సిక్స్ ఎయిర్‌బ్యాగ్స్, ఏబీఎస్, స్టెబిలిటీ కంట్రోల్, ట్రాక్షన్ కంట్రోల్, కార్నరింగ్ బ్రేక్ కంట్రోల్, ఎలక్ట్రిక్ పార్కింగ్ బ్రేక్ విత్ ఆటో హోల్డ్, హిల్ స్టార్ట్ అసిస్ట్, యాక్టివ్ పార్క్ డిస్టెన్స్ కంట్రోల్, రేర్ వ్యూ కెమెరా, పార్కింగ్ అసిస్టెంట్, ఐఎక్ఓఎఫ్ఐఎక్స్ మౌంట్స్, టీపీఎంఎస్, లేన్ డిపార్చర్ వార్నింగ్, క్రూయిజ్ కంట్రోల్ విత్ బ్రేక్ ఫంక్షన్, ఆటోమేటిక్ ఎమర్జెన్సీ బ్రేకింగ్, పెడెస్ట్రెయన్ ప్రొటెక్షన్ తదితర సేఫ్టీ ఫీచర్లు ఉన్నాయి.
BMW iX1,BMW iX1 EV SUV,SUV,BMW
BMW iX1, BMW iX1 EV, BMW iX1 SUV, BMW iX1, BMW, iX1, బీఎండబ్ల్యూ, జర్మనీ, ఎస్‌యూవీ, బీఎండబ్ల్యూ ఐఎక్స్1
https://www.teluguglobal.com//business/bmw-ix1-ev-launched-in-india-at-6690-lakh-promises-up-to-440-km-range-964513