Chiranjeevi | చిరు తదుపరి చిత్రం ఇతడితోనే..!

 

2024-05-22 01:37:11.0

https://www.teluguglobal.com/h-upload/2024/04/13/1318740-chiranjeevi.webp

Chiranjeevi – గాడ్ ఫాదర్ కాంబినేషన్ రిపీట్ కాబోతోంది. మోహన్ రాజాకు మరోసారి ఛాన్స్ ఇచ్చారు చిరంజీవి.

ప్రస్తుతం విశ్వంభర సినిమా చేస్తున్నారు మెగాస్టార్. బింబిసార ఫేమ్ వశిష్ట దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో చిరు సరసన త్రిష హీరోయిన్ గా నటిస్తోంది. మరో ఇద్దరు హీరోయిన్లు కూడా ఉన్నారు. యూవీ క్రియేషన్స్ బ్యానర్ పై భారీ బడ్జెట్ తో తెరకెక్కుతున్న ఈ సినిమాను వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా జనవరి 10న విడుదల చేయబోతున్నారు.

ఓవైపు విశ్వంభర సినిమా చేస్తూనే మరోవైపు తన కొత్త సినిమాలపై కసరత్తు చేస్తున్నారు చిరంజీవి. ఇందులో భాగంగా గాడ్ ఫాందర్ కాంబినేషన్ ను రిపీట్ చేయబోతున్నారు. అవును.. అన్నీ అనుకున్నట్టు జరిగితే మోహన్ రాజా దర్శకత్వంలో చిరంజీవి మరో సినిమా చేసే ఛాన్స్ ఉంది.

చిరంజీవి కోసం బీవీఎస్ రవి మంచి కథ రాశాడు. స్క్రిప్ట్ దాదాపు పూర్తయింది. ఈ కథను మోహన్ రాజా చేతిలో పెట్టాలని చిరంజీవి అనుకుంటున్నారు. ఇంతకుముందు వీళ్లిద్దరి కాంబినేషన్ లో గాడ్ ఫాదర్ సినిమా వచ్చింది. ఆ సినిమా టైమ్ లోనే మోహన్ రాజా వర్క్ చిరంజీవికి నచ్చింది. అందుకే వెంటనే మరో అవకాశం ఇస్తున్నారు.

నిజానికి విశ్వంభర తర్వాత కూతురు సుశ్మిత నిర్మాతగా చిరంజీవి ఓ సినిమా చేయాలి. కానీ మోహన్ రాజా పేరు తెరపైకొచ్చిందంటే, సుశ్మిత సినిమా మరింత ఆలస్యమయ్యేలా కనిపిస్తోంది.

 

Chiranjeevi,Mohan Raja,Godfather