Chiranjeevi | సందీప్ వంగ దర్శకత్వంలో చిరు?

 

2024-07-22 11:19:48.0

https://www.teluguglobal.com/h-upload/2024/07/22/1346261-chiranjeevi-sundeep-vanga.webp

Chiranjeevi – ప్రస్తుతం చిరంజీవి విశ్వంభర సినిమా చేస్తున్నారు. ఆయన సందీప్ రెడ్డి వంగ దర్శకత్వంలో ఓ సినిమా చేస్తే ఎలా ఉంటుంది?

కొన్ని కాంబినేషన్లు అస్సలు కలవవు. కేవలం ఫాంటసీలుగా మాత్రమే మిగిలిపోతాయి. అలాంటి ఓ కాంబినేషన్ పై సోషల్ మీడియాలో ఆసక్తికర చర్చ సాగుతోంది. అదే చిరంజీవి, సందీప్ రెడ్డి వంగ కాంబో. వీళ్లిద్దరూ కలిసి సినిమా చేస్తే బాగుంటుందంటూ ఓ ఆసక్తికర చర్చ మొదలైంది.

సందీప్ రెడ్డి వంగ ప్రస్తుతం స్పిరిట్ పనిలో బిజీగా ఉన్నాడు. ప్రభాస్ హీరోగా రాబోతున్న ఆ సినిమాకు స్క్రీన్ ప్లే రాసే పనిలో సందీప్ నిమగ్నమై ఉన్నాడు. అయితే ప్రభాస్ మాత్రం వరుస సినిమాలతో బిజీగా ఉన్నాడు. స్పిరిట్ సెట్స్ పైకి రావడానికి కనీసం ఏడాది పట్టేలా ఉంది.

కాబట్టి ఈ గ్యాప్ లో చిరంజీవితో సందీప్ రెడ్డి ఓ సినిమా చేస్తే బాగుంటుందంటూ చిన్నపాటి చర్చ మొదలైంది. నిజానికి వీళ్లిద్దరూ కలిసే అవకాశాలు తక్కువ. సందీప్ రెడ్డి మైండ్ సెట్ కు, అతడి కథలకు.. చిరంజీవి ఇమేజ్, ఆలోచన విధానం సరిపోదు.

కాబట్టి వీళ్లిద్దరి కాంబోలో సినిమా రావడం దాదాపు అసాధ్యం. అయినప్పటికీ ఫాంటసీ కాంబినేషన్ కాబట్టి నెటిజన్లు తెగ మాట్లాడుకుంటున్నారు. కొంతమంది మరో అడుగు ముందుకేసి ఏఐ టెక్నాలజీతో వీళ్లిద్దరి ఫొటోల్ని సృష్టిస్తున్నారు.

 

Chiranjeevi,Sandeep vanga,Hot Discussion