Citroen Basalt | టాటా క‌ర్వ్‌తోపాటు ఆ నాలుగు కార్ల‌కు గ‌ట్టి పోటీ.. ఎస్‌యూవీ కూపే సిట్రోన్ బ‌సాల్ట్‌.. ఇవీ స్పెషిఫికేష‌న్స్‌..!

2024-08-04 07:52:20.0

Citroen Basalt | ఫ్రాన్స్ కార్ల త‌యారీ సంస్థ సిట్రోన్ (Citroen) ఎస్‌యూవీ కూపే (SUV-Coupe) కారు బ‌సాల్ట్ (Citroen Basalt) ప్రొడ‌క్ష‌న్ ఫామ్‌లోకి వ‌చ్చేసింది.

Citroen Basalt | ఫ్రాన్స్ కార్ల త‌యారీ సంస్థ సిట్రోన్ (Citroen) ఎస్‌యూవీ కూపే (SUV-Coupe) కారు బ‌సాల్ట్ (Citroen Basalt) ప్రొడ‌క్ష‌న్ ఫామ్‌లోకి వ‌చ్చేసింది. భార‌త్ రోడ్ల కోసం సీ-క్యూబ్డ్ ప్రోగ్రామ్ (C-Cubed programme) ఆధారంగా ప్ర‌త్యేకంగా త‌యారుచేసిన నాలుగో మోడ‌ల్ కారు సిట్రోన్ బ‌సాల్ట్ (Citroen Basalt). త్వ‌ర‌లో దేశీయ మార్కెట్లోకి రానున్న టాటా మోటార్స్ (Tata Motors) టాటా క‌ర్వ్ (Tata Curvv)కు సిట్రోన్ బ‌సాల్ట్ (Citroen Basalt) గ‌ట్టి పోటీ ఇవ్వ‌నున్న‌ది.

సిట్రోన్ బ‌సాల్ట్ (Citroen Basalt) ఏ కాన్సెప్ట్ డిజైన్ నుంచి వ‌స్తుంద‌న్న సంగ‌తి వెల్ల‌డించ‌కున్నా సీ3 ఎయిర్‌క్రాస్ ఎస్‌యూవీ (C3 Aircross SUV) కారును పోలి ఉంటుంద‌ని స‌మాచారం. ఫ్రంట్‌లో స్లైట్‌గా డిఫ‌రెంట్ లుక్‌నిచ్చేలా గ్రిల్లె ఇన్‌స‌ర్ట్ చేశారు. సిట్రోన్‌ బ‌సాల్ట్ (Citroen Basalt) కారు ఎల్ఈడీ డీఆర్ఎల్స్ (LED DRLs)తోపాటు ప్రొజెక్ట‌ర్ హెడ్ ల్యాంప్స్‌తో వ‌స్తోంది. బూట్ లిడ్ (boot lid) చివ‌ర్లో రూఫ్‌లైన్ స్లాపింగ్ డౌన్ (roofline sloping down)తో వ‌స్తున్న కూపే మోడ‌ల్ కారు ఇది. సిట్రోన్ బ‌సాల్ట్ టాప్ హై ఎండ్ మోడ‌ల్ కారు 17-అంగుళాల అల్లాయ్ వీల్స్‌తో అందుబాటులో ఉంటుంది. రేర్‌లో చంకీ బంప‌ర్‌, హ‌లోజ‌న్ టెయిల్ ల్యాంప్స్ ఉంటాయి.

సిట్రోన్ సీ3 ఎయిర్‌క్రాస్ క్యాబిన్‌నే సిట్రోన్ బ‌సాల్ట్‌లో వాడుతున్నారు. అయితే డిజిట‌ల్ రీడ్ఔట్స్‌తో న్యూ హెచ్‌వాక్ ప్యానెల్, ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్‌, లార్జ‌ర్ ఫ్రంట్ ఆర్మ్‌రెస్ట్‌, న్యూ హెడ్ రెస్ట్స్‌, రేర్ సీట్ల‌లో అడ్జ‌స్ట‌బుల్‌ థై స‌పోర్ట్ స్క్వాబ్స్ జ‌త చేశారు. సిట్రోన్ బ‌సాల్ట్ కారులో 10.25- అంగుళాల ట‌చ్‌స్క్రీన్‌, 7-అంగుళాల ఇన్‌స్ట్రుమెంట్ ప్యానెల్ ఉన్నాయి. సీ3 ఎయిర్‌క్రాస్‌లో మాదిరిగానే స్టీరింగ్ వీల్‌, క‌ల‌ర్స్ ఉంటాయి.

సిట్రోన్ బ‌సాల్ట్ కారు 1.2 నేచుర‌ల్లీ ఆస్పిరేటెడ్ పెట్రోల్ వేరియంట్ (82 బీహెచ్‌పీ విద్యుత్‌), 1.2 లీట‌ర్ల ట‌ర్బో పెట్రోల్ ఇంజిన్ (110 బీహెచ్పీ విద్యుత్‌) క‌లిగి ఉంది. ఈ రెండు ఇంజిన్లు మాన్యువ‌ల్ ట్రాన్స్‌మిష‌న్ ఆప్ష‌న్ క‌లిగి ఉన్నా, అద‌నంగా 1.2 ట‌ర్బో పెట్రోల్ ఇంజిన్ వేరియంట్ 6-స్పీడ్ టార్క్ క‌న్వ‌ర్ట‌ర్ ఆటోమేటిక్ ఆప్ష‌న్ కూడా క‌లిగి ఉంటుంది. త్వ‌ర‌లో భార‌త్ మార్కెట్లోకి రానున్న టాటా క‌ర్వ్‌తోపాటు హ్యుండాయ్ క్రెటా, కియా సెల్టోస్‌, మారుతి సుజుకి గ్రాండ్ విటారా త‌దిత‌ర కార్ల‌కు గ‌ట్టి పోటీ ఇవ్వ‌నున్న‌ది.

Citroen Basalt,SUV,Citroen,C-Cubed programme