https://www.teluguglobal.com/h-upload/2023/10/25/500x300_846143-citroen-c3.webp
2023-10-25 11:57:47.0
Citroen C3 | ప్రముఖ ఫ్రాన్స్ కార్ల తయారీ సంస్థ సిట్రోన్ (Citroen) తన పాపులర్ హ్యాచ్‌బ్యాక్ సిట్రోన్ సీ3 (Citroen C3) కారుపై ధర భారీగా తగ్గించి వేసింది.
Citroen C3 | ప్రముఖ ఫ్రాన్స్ కార్ల తయారీ సంస్థ సిట్రోన్ (Citroen) తన పాపులర్ హ్యాచ్‌బ్యాక్ సిట్రోన్ సీ3 (Citroen C3) కారుపై ధర భారీగా తగ్గించి వేసింది. సిట్రోన్ సీ3పై ఈ నెలాఖరు వరకూ కొత్త ధరలు అందుబాటులో ఉంటాయి. ఈ నెలాఖరు వరకూ బుకింగ్స్‌కు నూతన ధరలు వర్తిస్తాయి. గరిష్టంగా షైన్ వేరియంట్ (Shine variant)పై గరిష్టంగా రూ.57 వేలు డిస్కౌంట్ లభిస్తుంది. కేర్ ఫెస్టివల్ పేరుతో ఆథరైజ్డ్ డీలర్‌షిప్‌ల వద్ద తమ కార్లకు నవంబర్ నాలుగో తేదీ వరకూ సర్వీస్ క్యాంప్ నిర్వహిస్తోంది.
వేరియంట్ | రెగ్యులర్ ధర | ఆఫర్ ధర | తేడా |
లైవ్ | రూ.6.16 లక్షలు | రూ. 5.99 లక్షలు | రూ.17 వేలు |
ఫీల్ | రూ.7.08 లక్షలు | రూ. 6.53 లక్షలు | రూ. 55 వేలు |
షైన్ | రూ.7.60 లక్షలు | రూ. 7.03 లక్షలు | రూ. 57 వేలు |
ఫీల్ టర్బో | రూ.8.28 లక్షలు | రూ. 7.79 లక్షలు | రూ. 49 వేలు |
షైన్ టర్బో | రూ.8.80 లక్షలు | రూ. 8.29 లక్షలు | రూ. 51 వేలు |
సిట్రోన్ సీ3 (Citroen C3) కారు 1.2-లీటర్ల నేచురల్లీ ఆస్పిరేటెడ్ పెట్రోల్ ఇంజిన్‌తో వస్తోంది. ఈ ఇంజిన్ గరిష్టంగా 81 బీహెచ్‌పీ విద్యుత్, 115 ఎన్ఎం టార్క్ వెలువరిస్తుంది. 5-స్పీడ్ మాన్యువల్ ట్రాన్స్‌మిషన్ ఆప్షన్‌తో నడుస్తుందీ కారు.

సిట్రోన్ సీ3 (Citroen C3) కారు 1.2 లీటర్ల టర్బో పెట్రోల్ ఇంజిన్ విత్ 6-స్పీడ్ మాన్యువల్ ట్రాన్స్‌మిషన్ ఆప్షన్ కలిగి ఉంటుంది. ఈ కారు గరిష్టంగా 109 బీహెచ్‌పీ విద్యుత్, 190 ఎన్ఎం టార్క్ వెలువరిస్తుంది. ప్రస్తుతానికి ఆటోమేటిక్ ట్రాన్స్‌మిషన్ ఆప్షన్ అందుబాటులో లేదు.

సిట్రోన్ సీ3 (Citroen C3) కారు చెవ్రాన్ (బ్రాండ్ లోగో)తో డ్యుయల్ టోన్ ట్రీట్‌మెంట్ విత్ కంట్రాస్ట్ ఇన్‌సర్ట్స్, స్లీక్ క్రోమ్ ఎలిమెంట్స్, హెవీ క్లాడింగ్ తో వస్తుంది. బేబీ సీ5 (baby C5) మాదిరిగా సిట్రోన్ సీ3 (Citroen C3) ఉంటుంది . సిట్రోన్ సీ3 ఫోన్ ఇన్‌ఫోటైన్‌మెంట్ డిస్‌ప్లే విత్ 10-అంగుళాల కెపాక్టివ్ టచ్‌స్క్రీన్ యూనిట్‌తో వస్తుంది. 12వీ సాకెట్, యూఎస్బీ చార్జర్‌తోపాటు ఫ్లాట్ బాటమ్ మల్టీ ఫంక్షనల్ స్టీరింగ్ వీల్ ఉంటుంది. సీ5 ఎయిర్‌క్రాస్ మోడల్‌లో మాదిరిగా గ్లాసీ బ్లాక్ బెజెల్స్‌తోపాటు ఎయిర్ కండీషనింగ్, డాష్ బోర్డ్ మ్యాచెస్‌పై వైబ్రంట్ ప్యానెల్ ఉంటుంది. 8 సీట్ల కోవర్ విత్ స్మార్ట్ ఫోన్ క్లాంప్ అటాచ్ స్పేస్ కలిగి ఉంటుంది.
Citroen C3,Citroen,Hatchback,cars
Citroen C3, Citroen, hatchback, citroen c3 offers, citroen c3 price, citroen c3 price on road, citroen c3 hatchback or suv, citroen c3 hatchback review, సిట్రోన్ హ్యాచ్‌బ్యాక్, సీ3, సిట్రోన్ సీ3
https://www.teluguglobal.com//business/citroen-c3-hatchback-becomes-cheaper-by-57-thousand-970053