Darling | ప్రియదర్శి సినిమాకు రిలీజ్ డేట్ ఫిక్స్

 

2024-06-24 17:12:55.0

https://www.teluguglobal.com/h-upload/2024/06/24/1338990-darling.webp

Priyadarshi’s Darling Movie – ప్రియదర్శి, నభా నటేష్ హీరోహీరోయిన్లుగా నటిస్తున్న సినిమా డార్లింగ్. ఈ సినిమాకు రిలీజ్ డేట్ ఫిక్స్ అయింది.

ఈ సంవత్సరం ప్రారంభంలో పాన్ ఇండియా సెన్సేషన్ ‘హను-మాన్‌’ చిత్రాన్ని అందించిన బ్లాక్‌బస్టర్ ప్రొడక్షన్ హౌస్ ప్రైమ్‌షో ఎంటర్‌టైన్‌మెంట్ ఇప్పుడు ప్రియదర్శి, నభా నటేష్ లీడ్ రోల్స్ లో “డార్లింగ్” అనే సినిమాను తెరకెక్కిస్తోంది. ఈ రొమాంటిక్ కామెడీ ఎంటర్‌టైనర్‌ కు నిరంజన్ రెడ్డి నిర్మాత. అశ్విన్ రామ్ రైటర్, డైరెక్టర్.

ఇప్పటికే విడుదలైన గ్లింప్స్, ఫస్ట్ సింగిల్‌కి ప్రేక్షకుల నుంచి అద్భుతమైన స్పందన వచ్చింది. ఇప్పుడు ఈ మూవీని థియేటర్లలో విడుదల చేసేందుకు మేకర్స్ సన్నాహాలు చేస్తున్నారు. ఈ చిత్రాన్ని జూలై 19న ప్రపంచ వ్యాప్తంగా విడుదల చేయనున్నట్టు అనౌన్స్ చేశారు.

రొమాంటిక్ కామెడీ ఎంటర్‌టైనర్‌గా రూపొందిన ఈ మూవీతో ఇప్పటి యూత్ కనెక్ట్ అవుతారని నమ్మకంగా చెబుతున్నాడు నిర్మాత. బ్రహ్మానందం, విష్ణు, కృష్ణతేజ్, అనన్య నాగళ్ల కీలక పాత్రలు పోషిస్తున్న ఈ సినిమాకు వివేక్ సాగర్ సంగీతం అందిస్తున్నాడు. 

 

Priyadarshi,Nabha Natesh,Darling Movie