Darling Movie | ఓ అపరిచితురాలి కథ

 

2024-07-07 09:05:40.0

https://www.teluguglobal.com/h-upload/2024/06/24/1338990-darling.webp

Darling Movie Trailer – ప్రియదర్శి, నభా నటేష్ హీరోహీరోయిన్లుగా నటించిన సినిమా డార్లింగ్. తాజాగా ట్రయిలర్ రిలీజైంది.

ప్రియదర్శి, నభా నటేష్ లీడ్ రోల్స్ లో నటిస్తున్న యూనిక్ రొమాంటిక్ కామెడీ ఎంటర్ టైనర్ ‘డార్లింగ్’. అశ్విన్ రామ్ దర్శకత్వం వహిస్తున్నారు. ప్రైమ్‌షో ఎంటర్‌టైన్‌మెంట్‌ కె నిరంజన్ రెడ్డి, శ్రీమతి చైతన్య నిర్మించిన ఈ చిత్రం ఎంటర్టైనింగ్ ప్రమోషనల్ కంటెంట్ తో హ్యుజ్ బజ్‌ని క్రియేట్ చేస్తోంది. డార్లింగ్ జూలై 19న ప్రపంచ వ్యాప్తంగా విడుదల కానుంది.

ఈ నేపధ్యంలో సినిమా ట్రయిలర్ ను విడుదల చేశారు. ట్రయిలర్ రిలీజ్ ఈవెంట్ కు విశ్వక్ సేన్ ప్రత్యేక అతిథిగా హాజరయ్యాడు. ట్రయిలర్ తో సినిమాపై ఫుల్ క్లారిటీ ఇచ్చారు. హీరో చాలా ఇన్నోసెంట్, సింపుల్ బ్యాక్ గ్రౌండ్ అతడిది. హీరోయిన్ హైఫై, సోషల్ లైఫ్ యాక్టివ్ గా ఉంటుంది.

పెళ్లి చేసుకొని, భార్యను పారిస్ తీసుకెళ్లాలనేది హీరో ఆశ-ఆశయం. అదే టైమ్ లో హీరోయిన్ మల్టీపుల్ డిజార్డర్ తో ఇబ్బంది పడుతుంది. ఎప్పుడు ఎలా ప్రవర్తిస్తుందో తనకే తెలియదు. ఇలాంటి భార్యతో హీరో ఎలా నెట్టుకొచ్చాడు, ఆమెను పారిస్ తీసుకెళ్లాడా లేదా అనేది సినిమా.

ప్రియదర్శి, నభా తమ పాత్రలకు పూర్తి న్యాయం చేశారు. సినిమా మొత్తం వీళ్ల చుట్టూనే తిరుగుతూ, వినోదాన్ని అందిస్తోంది. అయితే ట్రయిలర్ లో కనిపించింది మాత్రమే కాకుండా, మూవీలో మరిన్ని ట్విస్టులు ఉన్నాయంటున్నారు మేకర్స్. 

 

Priyadarshi,Darling Movie,Trailer Review,Nabha Natesh