Darling Movie | ప్రియదర్శి-నభా నటేష్ హీరోహీరోయిన్లుగా సినిమా

 

2024-04-21 08:07:44.0

https://www.teluguglobal.com/h-upload/2024/04/21/1320906-darling-1.webp

Darling – ప్రియదర్శి, నభా నటేష్ ఈమధ్య సోషల్ మీడియాలో వాదించుకున్నారు. అదంతా ఈ సినిమా ప్రచారం కోసమే…

హను-మాన్‌ లాంటి బ్లాక్ బస్టర్ ను నిర్మించిన నిరంజన్ రెడ్డి నుంచి తదుపరి చిత్రం రెడీ అయింది. ఈ సినిమా పేరు డార్లింగ్. బలగం, ఓం భీమ్ బుష్, సేవ్ ది టైగర్స్ సిరీస్‌ల విజయాలతో దూసుకుపోతున్న ప్రియదర్శి ఈ చిత్రంలో హీరోగా నటిస్తున్నాడు. నభా నటేష్ హీరోయిన్. రొమాంటిక్ కామెడీ ఎంటర్ టైనర్ గా వస్తున్న ఈ సినిమాకు అశ్విన్ రామ్ దర్శకుడు.

ఈ చిత్రానికి ‘డార్లింగ్’ అనే టైటిల్‌ను మేకర్స్ అనౌన్స్ చేశారు. ‘వై దిస్ కొలవెరి’ అనే ఆసక్తికరమైన ట్యాగ్‌లైన్‌ పెట్టారు. నభా నటేష్‌తో ప్రియదర్శి పెళ్లి ప్రపోజల్‌ని చూపించే ఫస్ట్‌లుక్ పోస్టర్ టైటిల్‌లాగే ఆహ్లాదకరంగా ఉంది. టైటిల్ అనౌన్స్మెంట్ గ్లింప్స్ లో ప్రియదర్శి , నభా నటేష్ మధ్య రిలేషన్ ని చూపించారు. ఇది పూర్తిగా హిలేరియస్ గా ఉంది.

సెలూన్‌లో ప్రియదర్శి చెప్పే డైలాగ్స్ బాగున్నాయి. వివిధ దశల్లో మహిళల మనస్తత్వాల గురించి హీరో చెప్పడం, వెంటనే నభా నటేష్ చూపులతో, మాటలతో దర్శికి చుక్కలు చూపించడం హిలేరియస్ గా ఉంది.

హనుమాన్ నిర్మాత నుంచి వస్తోన్న ఈ సినిమాపై కాస్త అంచనాలున్నాయి. ఈ సినిమాలో అనన్య నాగళ్ల కీలక పాత్ర పోషిస్తోంది. వివేక్ సాగర్ సంగీతం అందిస్తున్నాడు. ఈ సినిమా ప్రచారం కోసమే ప్రియదర్శి-నభానటేష్ సోషల్ మీడియాలో కొట్టుకుంటున్నట్టు నటిస్తూ పోస్టులు పెట్టారు. అలా వైరల్ అయిన తర్వాత టైటిల్ ఎనౌన్స్ చేశారు.

 

Priyadarshi,Nabha Natesh,Darling Movie