Dasara Movie: రేపే `దసరా`

2023-03-29 07:41:04.0

Nani’s Dasara movie release date: సంతోష్ నారాయణన్ సమకూర్చిన బాణీల్లో `చమ్కీల అంగీలేసి` అనే పాట ఇప్పటికే వైరల్ అయ్యి.. రీల్స్, షార్ట్స్ తో సోషల్ మీడియాలో భలే క్రేజ్ సొంతం చేసుకుంది.

తెలుగు సినిమా ప్రతి ఏడాదికి కొత్త పుంతలు తొక్కుకుతోంది. కొత్త కథలు, కొత్త ప్రయోగాలు, నేటి తరం దర్శకులు ఆలోచనలకు మేళవించేలా నిర్మాతలు సైతం ప్రోత్సహిస్తున్నారు. నాని తాజాగా నటించిన చిత్రం దసరా.. రేపే ఎన్నో అంచనాలతో విడుదలకు సిద్ధమవుతోంది. ఈ మధ్య కాలంలో అంత రస్టిక్ లుక్ తో తెలుగు సినీ అభిమానులను ఆకర్షించిన చిత్రం ఇదే. ఇప్పటికే విడుదలైన పాటలకు, చిత్ర ట్రైలర్ కు మంచి స్పందనే వచ్చింది. తెలంగాణ సింగరేణి బొగ్గు గని నేపథ్యంలో సాగే ఈ కథలో నాని `ధరణి`గా కనిపించనున్నారు. కీర్తి సురేష్ `వెన్నెల` పాత్రలో కనువిందు చేయనుంది. ఈ చిత్ర దర్శకుడు శ్రీకాంత్ ఓదేలకు ఇదే మొదటి సినిమా అయినా.. ఎంతో అనుభవం ఉన్న దర్శకుడిగా తన సినిమాని రూపొందించాడని నాని ఇప్పటికే పలు సందర్భాల్లో చెప్పాడు. శ్రీకాంత్ గతంలో సుకుమార్ దర్శకత్వ బృందంలో రంగస్థలం, నాన్నకు ప్రేమతో సినిమాలకు అసోసియేట్ గా పనిచేశాడు.

ఈ సినిమాను పాన్ ఇండియా లెవెల్లో తమిళం, మలయాళం, కన్నడ, హిందీ భాషల్లో రిలీజ్ చేస్తున్నారు. సంతోష్ నారాయణన్ సమకూర్చిన బాణీల్లో `చమ్కీల అంగీలేసి` అనే పాట ఇప్పటికే వైరల్ అయ్యి.. రీల్స్, షార్ట్స్ తో సోషల్ మీడియాలో భలే క్రేజ్ సొంతం చేసుకుంది. తమిళ నటుడు సముద్ర‌ ఖని కీలక పాత్రలో నటించిన ఈ సినిమాకి సత్య సూరన్ కెమెరా వర్క్ చేశారు. శ్రీ లక్ష్మి వెంకటేశ్వర సినిమాస్ పై సుధాకర్ చెరుకూరి ఈ సినిమాని నిర్మించారు. అన్ని హంగులతో నిర్మితమైన ఈ సినిమాపై మంచి అంచనాలే ఉన్నాయి. మరి రేపు ఈ దసరా ప్రేక్షకులని ఎలా అలరిస్తుందో వేచిచూద్దాం.

 

Dasara Movie,Natural star Nani,Tollywood,Upcoming Movies