Deekshit Shetty | దసరా నటుడి నుంచి మరో సినిమా

 

2024-05-20 17:06:13.0

https://www.teluguglobal.com/h-upload/2024/05/20/1329224-deekshit-shetty-1.webp

Deekshit Shetty – దసరా సినిమాతో పేరు తెచ్చుకున్న దీక్షిత్ శెట్టి, మరో తెలుగు సినిమా రెడీ చేశాడు. ఫస్ట్ లుక్ కూడా రిలీజ్ చేశాడు.

దీక్షిత్ శెట్టి గురించి పెద్దగా పరిచయం అక్కర్లేదు. దసరా సినిమాతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన ఈ నటుడు, ఆ సినిమాతో మంచి పేరు తెచ్చుకున్నాడు. ఇప్పుడు అతడు తెలుగులో మరో సినిమా రెడీ చేశాడు.

దీక్షిత్ శెట్టి హీరోగా అభిషేక్ దర్శకత్వంలో తెలుగు- కన్నడ ద్విభాషా చిత్రంగా ఓ క్రైమ్ కామెడీ థ్రిల్లర్ రూపొందుతోంది. బృందా ఆచార్య హీరోయిన్ గా నటిస్తోంది. శ్రీ దేవి ఎంట‌ర్‌టైన‌ర్స్ బ్యానర్ పై హెచ్ కె ప్రకాష్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.

ఈ చిత్రానికి ‘బ్యాంక్ ఆఫ్ భాగ్యలక్ష్మి’ అనే క్యాచి టైటిల్ ని ఖరారు చేశారు. ఫస్ట్ లుక్ పోస్టర్ లో హీరో దీక్షిత్ శెట్టి గన్ షూట్ చేస్తూ, కాలికి టైగర్ మాస్క్ పెట్టుకొని కనిపించడం ఆసక్తికరంగా ఉంది. ఈ ఫస్ట్ లుక్ పోస్టర్ సినిమా పై చాలా క్యురియాసిటీని పెంచింది.

ఈ చిత్రానికి జుధాన్ శ్యాండీ సంగీతం అందిస్తున్నాడు. అభిషేక్ జే డీవోపీగా పని చేస్తున్నాడు. మే 25న ‘బ్యాంక్ ఆఫ్ భాగ్యలక్ష్మి’ టీజర్ ని విడుదల చేస్తున్నట్లు మేకర్స్ అనౌన్స్ చేశారు.

 

Deekshit Shetty,Bank Of Bhagyalakshmi,Telugu Kannada Movie,New Movie