Dhanush | రూ.150 కోట్ల ఇంటిపై హీరో క్లారిటీ

 

2024-07-27 14:12:36.0

https://www.teluguglobal.com/h-upload/2022/11/18/426596-sir-movie-dhanush-1.webp

Dhanush – రీసెంట్ గా 150 కోట్లు పెట్టి ఇల్లు కొన్నాడు ధనుష్. ఇక్కడ రేటుతో సమస్య కాదు. ఆ ఇల్లు ఉన్న ప్రదేశం అతడికి సమస్యలు తెచ్చిపెట్టింది.

రాయన్ సినిమా విడుదలకు కొన్ని రోజుల ముందు ధనుష్ ఓ పెద్ద ప్రాపర్టీ కొనుగోలు చేశాడు. అటు రజనీకాంత్, ఇటు జయలలిత ఇళ్లకు మధ్యలో ఉండే ఓ పెద్ద బంగ్లాను ఏకంగా 150 కోట్ల రూపాయలు పెట్టి కొన్నాడు.

దీనికి సంబంధించి ధనుష్ పై విమర్శలు చెలరేగాయి. సోషల్ మీడియాలో పెద్ద ట్రోలింగ్ నడిచింది. రీసెంట్ గా ట్రోలింగ్ పై స్పందించాడు ధనుష్. ఆ బంగ్లా కొనడం తన చిరకాల కోరికగా వెల్లడించాడు.

“పోయెస్ గార్డెన్‌లో ఇల్లు కొనడం చాలా పెద్ద చర్చనీయాంశంగా మారుతుందని నాకు తెలిస్తే, దానికి బదులుగా ఓ అపార్ట్‌మెంట్ లో చిన్న ఫ్లాట్ కొనుక్కునేవాడ్ని. నాలాంటి వ్యక్తి పోయెస్ గార్డెన్ లో ఇల్లు కొనకూడదా. పోయెస్‌ గార్డెన్‌ వీధుల్లో ఉన్న ఇంట్లో పుట్టిన వ్యక్తి జీవితాంతం అక్కడే ఉండాలా?”

ఇలా ట్రోలర్స్ కు గట్టి సమాధానం ఇచ్చాడు ధనుష్. పైగా ఆ ఇల్లు కొనడం వెనక కారణాన్ని కూడా బయటపెట్టాడు.

“పోయెస్ గార్డెన్‌లో ఇల్లు కొనడం వెనుక ఒక చిన్న ఉదంతం ఉంది. నాకు 16 ఏళ్లు. ఒక రోజు నా ఫ్రెండ్ బైక్ పై తిరుగుతున్నాను. రజినీకాంత్ ఇంటిని చూడాలని కోరిక. దూరం నుంచి తళైవా ఇల్లు చూసి బైక్‌పై తిరిగి వస్తుండగా, రజనీ ఇంటికి అటువైపు జయలలిత ఇల్లు ఉందని అక్కడి ప్రజలు చెప్పారు. ఆ సమయంలో రెండు ఇళ్లను చూశాను. పోయెస్ గార్డెన్‌లో ఒక చిన్న ఇంటినైనా సొంతం చేసుకోవాలనే కోరిక నా మనసులో కలిగింది. ఇన్నాళ్లకు ఆ కోరిక నెరవేరింది.”

ఇలా తన చిన్ననాటి కోరికను నెరవేర్చుకున్నట్టు వెల్లడించాడు ధనుష్. అతడు నటించిన 50వ సినిమా రాయన్. ఈ సినిమాకు అతడే దర్శకుడు. రచయిత కూడా అతనే.

 

Dhanush,150 Crore House,Poes Garden