Double Ismart | పుష్ప-2 విడుదల తేదీకి రామ్ సినిమా

 

2024-06-15 17:30:39.0

https://www.teluguglobal.com/h-upload/2024/06/15/1336869-double-ismart-1.webp

Double Ismart – లెక్కప్రకారం ఆగస్ట్ 15కి పుష్ప-2 రావాలి. కానీ అది వాయిదా పడింది. ఆ తేదీకి డబుల్ ఇస్మార్ట్ వస్తోంది.

ఉస్తాద్ రామ్ పోతినేని, సెన్సేషనల్ డైరెక్టర్ పూరి జగన్నాధ్ కాంబినేషన్ లో బ్లాక్ బస్టర్ ఇస్మార్ట్ శంకర్ చిత్రానికి సీక్వెల్‌ గా వస్తోంది డబుల్ ఇస్మార్ట్. మేకర్స్ ఈరోజు సినిమా విడుదల తేదీకి సంబంధించిన అప్‌డేట్‌ను ఇచ్చారు. డబుల్ ఇస్మార్ట్ ఆగష్టు 15న స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా థియేటర్లలో విడుదల కానుందని మేకర్స్ అఫీషియల్ గా అనౌన్స్ చేశారు.

సినిమా విడుదలకు ఇండిపెండెన్స్ డే మంచి టైమ్. గురువారం సెలవు కాగా, సోమవారం (రక్షాబంధన్) మరో హాలీ డే కూడా సినిమాకు కలిసిరానుంది. ఇలా రామ్ సినిమాకు లాంగ్ వీకెండ్ కలిసొచ్చింది. రిలీజ్ డేట్ సందర్భంగా, మరో పోస్టర్ రిలీజ్ చేశారు. రామ్ విభూతి ధరించి కనిపించాడు. బ్యాక్ గ్రౌండ్ లో ఒక శివలింగం, కాగడాని చూడవచ్చు.

ఈ సినిమా టీజర్‌ను విడుదల చేసిన మేకర్స్ రెగ్యులర్ అప్‌డేట్స్ ఇస్తున్నారు. యాక్షన్, ఎంటర్‌టైన్‌మెంట్ పరంగా ప్రీక్వెల్‌కి రెట్టింపు కిక్ ఇస్తుందట డబుల్ ఇస్మార్ట్. కావ్య థాపర్ హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాలో సంజయ్ దత్ విలన్ గా నటిస్తున్నాడు. మణిశర్మ సంగీతం అందిస్తున్నాడు.

 

double ismart,Aug 15 Release,Ram Pothineni,kavya thapar