Double Ismart | రామ్ సినిమా ట్రయిలర్ రెడీ

 

2024-08-02 17:44:05.0

https://www.teluguglobal.com/h-upload/2024/08/02/1349296-double-ismart.webp

Double Ismart – డబుల్ ఇస్మార్ట్ ట్రయిలర్ రెడీ అయింది. వైజాగ్ లో రిలీజ్ చేయాలని నిర్ణయించారు.

రామ్ పోతినేని, పూరీ జగన్నాధ్ మోస్ట్ ఎవెయిటింగ్ హై-బడ్జెట్ పాన్ ఇండియా మూవీ డబుల్ ఇస్మార్ట్. ఈ సినిమా ట్రయిలర్ రెడీ అయింది. ఆగస్ట్ 4న విడుదల కానుంది.

ట్రైలర్ లాంచ్ ఈవెంట్ వైజాగ్‌లోని గురజాడ కళాక్షేత్రంలో జరగనుంది. టీజర్, పాటలకు అద్భుతమైన రెస్పాన్స్ రావడంతో ట్రైలర్ పై అంచనాలు భారీగా పెరిగాయి. ట్రైలర్ ప్రేక్షకులను ఆకట్టుకునేలా, మూవీకి మరింత బజ్‌ని క్రియేట్ చేస్తోందని అంటోంది యూనిట్.

డబుల్ ఇస్మార్ట్‌ను పూరి కనెక్ట్స్ బ్యానర్‌పై పూరి జగన్నాధ్, ఛార్మి కౌర్ నిర్మించారు. ఈ చిత్రంలో సంజయ్ దత్ విలన్ గా, కావ్య థాపర్ హీరోయిన్ గా నటించారు. ఈ చిత్రానికి సంగీతం మణిశర్మ అందించగా, డీవోపీగా శ్యామ్ కె నాయుడు, జియాని జియానెలీ పని చేస్తున్నారు.

డబుల్ ఇస్మార్ట్ ఆగస్టు 15న స్వాతంత్ర్య దినోత్సవం రోజున తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం, హిందీ భాషల్లో ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదలకానుంది. 

 

Ram,double ismart,Double Ismart Trailer,Ram Vizag