Double Ismart | రామ్ సినిమా షూటింగ్ అప్ డేట్స్

 

2024-06-26 16:06:01.0

https://www.teluguglobal.com/h-upload/2024/06/26/1339602-double-ismart.webp

Ram Pothineni’s Double Ismart – డబుల్ ఇస్మార్ట్ తో మరోసారి ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు రామ్. ఈ సినిమా షూటింగ్ అప్ డేట్స్ చెక్ చేద్దాం

రామ్ పోతినేని, పూరి జగన్నాధ్ కాంబోలో ఇస్మార్ట్ శంకర్ మూవీకి సీక్వెల్‌ గా ‘డబుల్ ఇస్మార్ట్” వస్తోంది. ఈసారి మరింత ఫన్, మరింత యాక్షన్ గ్యారెంటీ అంటోంది యూనిట్. సంజయ్ దత్ ఈ సినిమాలో విలన్ గా నటించడంతో, ప్రాజెక్టుకు పాన్ ఇండియా అప్పీల్ వచ్చింది.

ఈ మాస్ యాక్షన్ ఎంటర్‌టైనర్ ను ఆగష్టు 15న విడుదల చేయబోతున్నారు. ఇది సినిమా విడుదలకు పెర్ఫెక్ట్ టైం. ఈ రోజు 50 రోజుల కౌంట్‌డౌన్‌ను మార్కింగ్ చేస్తూ రామ్ పోతినేని స్పెషల్ పోస్టర్‌ను రిలీజ్ చేశారు. పనిలో పనిగా షూటింగ్ అప్ డేట్స్ కూడా అందించారు.

టైటిల్ సాంగ్ షూట్ ప్రస్తుతం హైదరాబాద్‌లో జరుగుతోంది. ఇస్మార్ట్ శంకర్ టైటిల్ సాంగ్ ఎంత పెద్ద హిట్టయిందో తెలిసిందే. డబుల్ ఇస్మార్ట్ టైటిల్ సాంగ్ అంతకంటే పెద్ద హిట్టవుతుందని అంటున్నారు మేకర్స్. పక్కా చార్ట్‌బస్టర్ అయ్యే ఈ పాటలో రామ్ పోతినేని సిగ్నేచర్ స్టెప్స్ ఉంటాయంట.

మణిశర్మ కంపోజ్ చేసిన ఎనర్జిటిక్ మాస్ సాంగ్ కు జానీ మాస్టర్ కొరియోగ్రఫీ చేస్తున్నారు. త్వరలోనే సాంగ్ రిలీజ్ గురించి అధికారికంగా ప్రకటన చేస్తారు. సినిమాలో రామ్ కు జోడిగా కావ్య థాపర్ నటిస్తోంది. ఈ చిత్రాన్ని పూరి జగన్నాధ్, ఛార్మి కౌర్ నిర్మిస్తున్నారు. 

 

Ram Pothineni,double ismart,shooting updates,Puri Jagannadh