https://www.teluguglobal.com/h-upload/2023/11/01/500x300_849384-iphone14.webp
2023-11-01 08:08:18.0
Flipkart Big Diwali Sale | ప్రస్తుతం దేశవ్యాప్తంగా పండుగల సీజన్ సాగుతోంది. మరో 13 రోజుల్లో దీపావళి పండుగ రానున్నది. భారతీయులు పండుగల్లోనే తమకు ఇష్టమైన వస్తువు కొనుగోలు చేస్తుంటారు.
Flipkart Big Diwali Sale | ప్రస్తుతం దేశవ్యాప్తంగా పండుగల సీజన్ సాగుతోంది. మరో 13 రోజుల్లో దీపావళి పండుగ రానున్నది. భారతీయులు పండుగల్లోనే తమకు ఇష్టమైన వస్తువు కొనుగోలు చేస్తుంటారు. ఇప్పుడంతా గ్యాడ్జెట్ల మయం కదా.. అందునా ఆపిల్ ఐ-ఫోన్ అంటే ప్రతి ఒక్కరూ తమ వద్ద ఉండాలని కోరుకుంటారు. సామాన్యులు, మధ్య తరగతి వర్గాలకు ఐ-ఫోన్ ధర అందుబాటులో ఉండదు మరి. ఐ-ఫోన్ సొంతం చేసుకోవాలని భావించే వారికి ప్రస్తుత దీపావళి పండుగ నేపథ్యంలో ఈ-కామర్స్ జెయింట్ ఫ్లిప్‌కార్ట్ ఆకర్షణీయమైన ఆఫర్ అందిస్తోంది. అతి తక్కువ ధరకే ఆపిల్ ఐ-ఫోన్ 14 ఫోన్ సొంతం చేసుకోవచ్చు. ఇప్పుడు రూ.49,999లకే లభిస్తుంది. నవంబర్ రెండో తేదీ నుంచి 11 వరకూ ఫ్లిప్‌కార్ట్ దీపావళి ఫెస్టివల్ సేల్స్ అందిస్తోంది. ఫ్లిప్‌కార్ట్ దీపావళి ఫెస్టివల్ సేల్.. అంటే వివిధ బ్యాంకు క్రెడిట్ కార్డులపై ఆఫర్లు, ఇతర డిస్కౌంట్లు లభిస్తాయి.
గతేడాది ఆపిల్ ఫార్ ఔట్ ఈవెంట్‌లో ఐ-ఫోన్ 14 సిరీస్ ఫోన్లు ఆవిష్కరించింది. నాడు ఆపిల్ ఐ-ఫోన్ 14 బేస్ (128 జీబీ ఇంటర్నల్ స్టోరేజీ) ధర రూ.79,900లుగా ప్రకటించింది. కానీ, ఇదే ఫోన్ ఇప్పుడు దీపావళి ఆఫర్ కింద రూ.50 వేల లోపు ధరకే లభిస్తుంది. ఫ్లిప్‌కార్ట్ దీపావళి సేల్స్ కింద రూ.54,999లకే అందుబాటులో ఉన్నట్లు వెబ్‌సైట్‌లో పేర్కొంది.
దీనికి అదనంగా బ్యాంక్ డిస్కౌంట్ కూడా ఆఫర్ చేస్తోంది. ఎస్బీఐ క్రెడిట్ కార్డు లేదా, ఫ్లిప్‌కార్ట్ యాక్సిస్ బ్యాంక్ క్రెడిట్ కార్డు ద్వారా కొనుగోలు చేస్తే రూ.4000 డిస్కౌంట్, ఎక్స్చేంజ్ కింద అదనంగా రూ.1000 తగ్గిస్తోంది. అన్ని ఆఫర్లు కలుపుకుని రూ.49,999లకే ఆపిల్ ఐ-ఫోన్ 14 ఫోన్ లభిస్తుంది. అంతే కాదు.. కస్టమర్లు రూ.19,999 డౌన్ పేమెంట్ చేసి.. మిగతా రూ.35 వేలు నో-కాస్ట్ ఈఎంఐ ఆప్షన్ల కింద చెల్లించి ఆపిల్ ఐ-ఫోన్ 14 సొంతం చేసుకోవచ్చు.
గతేడాది సెప్టెంబర్‌లో ఆపిల్ ఆవిష్కరించిన ఐ-ఫోన్ 14 ఫోన్ 6.1-అంగుళాల సూపర్ రెటీనా ఎక్స్‌డీఆర్ ఓలెడ్ డిస్ ప్లే విత్ 1200 నిట్స్ పీక్ బ్రైట్‌నెస్ కలిగి ఉంటుంది. డోల్బీ విజన్‌కు మద్దతుగా ఉంటుంది. ఆపిల్ ఐ-ఫోన్ 14 ఫోన్ ఆపిల్ ఏ15 బయోనిక్ ఎస్వోసీ చిప్‌సెట్‌పై పని చేస్తుంది.
ఐ-ఫోన్ 14 ఫోన్ 12-మెగా పిక్సెల్ వైడ్ యాంగిల్ కెమెరా కలిగి ఉంటుంది. దీంతోపాటు మరో సెకండరీ 12-మెగా పిక్సెల్ సెన్సర్ కెమెరా ఉంటది. రెండింటికీ వెనుక వైపు నుంచి 120 డిగ్రీల ఫీల్డ్ ఆఫ్ వ్యూ కూడా ఉంది. వీటితోపాటు సెల్ఫీలూ వీడియో కాల్స్ కోసం 12-మెగా పిక్సెల్ ట్రూత్ డెప్త్ కెమెరా ఇచ్చింది. ఐ-ఫోన్ 14 ఫోన్ ఫ్రంట్ ప్యానెల్‌పై సిరామిక్ షీల్డ్ మెటీరియల్‌తోపాటు ఫ్లాట్ ఎడ్జ్ ఎయిరోస్పేస్ గ్రేడ్ అల్యూమినియం ఫ్రేమ్ కలిగి ఉంటది.
Big Diwali Sale 2023,Flipkart,Diwali,iPhone 14
Flipkart Big Diwali Sale, Big Diwali Sale 2023, Flipkart, Diwali, Diwali sale, telugu news, telugu global news, latest telugu news, iPhone 14
https://www.teluguglobal.com//business/iphone-14-to-be-available-for-as-low-as-rs-49999-during-flipkart-big-diwali-sale-heres-how-the-deal-works-971355