2024-04-29 16:58:08.0
https://www.teluguglobal.com/h-upload/2024/04/29/1323281-gam-gam-ganesha-1.webp
Gam Gam Ganesha – మామగారి జ్ఞాపకార్థం తన నటిస్తున్న హరోంహర సినిమాను మే 31న విడుదల చేయబోతున్నట్టు ప్రకటించాడు సుధీర్ బాబు. ఆ ప్రకటన వచ్చి 24 గంటలైనా గడవకముందే ఆ సినిమాకు పోటీ వచ్చింది.
బేబి” వంటి బ్లాక్ బస్టర్ హిట్ తర్వాత యంగ్ హీరో ఆనంద్ దేవరకొండ ప్రేక్షకుల ముందుకొస్తున్న సినిమా “గం..గం..గణేశా”. ఈ సినిమాను హై-లైఫ్ ఎంటర్ టైన్ మెంట్ బ్యానర్ పై కేదార్ సెలగంశెట్టి, వంశీ కారుమంచి నిర్మిస్తున్నారు. ఉదయ్ శెట్టి ఈ చిత్రంతో దర్శకుడిగా పరిచయం అవుతున్నాడు.
ఆనంద్ దేవరకొండ తన కెరీర్ లో చేస్తున్న ఫస్ట్ యాక్షన్ మూవీ ఇది కావడం విశేషం. ఇవాళ ఈ సినిమా రిలీజ్ డేట్ ను అఫీషియల్ గా అనౌన్స్ చేశారు మేకర్స్. మే 31న “గం..గం..గణేశా” సినిమాను థియేటర్లలోకి తీసుకురాబోతున్నారు.
“గం..గం..గణేశా” రిలీజ్ డేట్ అనౌన్స్ మెంట్ సందర్భంగా రిలీజ్ చేసిన పోస్టర్ ఆసక్తికరంగా ఉంది. కొండ అంచున నిలబడి ఉన్న హీరో ఆనంద్ గన్ ఫైర్ చేసినప్పుడు ఆ గన్ నుంచి గులాబి రేకలు వస్తున్నట్లు పోస్టర్ డిజైన్ చేశారు. సరికొత్త కంటెంట్ తో ఈ సమ్మర్ లో అన్ని వర్గాల ఆడియెన్స్ ను “గం..గం..గణేశా” ఎంటర్ టైన్ చేయనుంది.
ఈ సినిమాలో ఆనంద్ దేవరకొండ సరసన ప్రగతి శ్రీవాస్తవ, కరిష్మా హీరోయిన్లుగా నటించారు. వెన్నెల కిషోర్ కీలక పాత్ర పోషించాడు. చైతన్ భరధ్వాజ్ సంగీతం అందించాడు.
Anand Deverakonda,Gam Gam Ganesha,Release Date,May 31 Release