Game Changer | క్రిస్మస్ కు గేమ్ ఛేంజర్ రిలీజ్

 

2024-07-21 17:16:36.0

https://www.teluguglobal.com/h-upload/2024/03/28/1313813-game-changer-1.webp

Game Changer – రామ్ చరణ్ హీరోగా నటిస్తున్న గేమ్ ఛేంజర్ సినిమా క్రిస్మస్ కానుకగా రిలీజ్ అవుతోంది. దిల్ రాజు ఈ ప్రకటన చేశారు.

రామ్ చరణ్ హీరోగా నటిస్తున్న సినిమా గేమ్ ఛేంజర్. ఈ సినిమా విడుదల తేదీపై దాదాపు 2 నెలలుగా సస్పెన్స్ కొనసాగుతోంది. అసలు ఈ ఏడాది ఈ సినిమా థియేటర్లలోకి వచ్చే అవకాశం లేదంటూ కొంతమంది వాదించడం మొదలుపెట్టారు.

ఎట్టకేలకు గేమ్ ఛేంజర్ కు లైన్ క్లియర్ అయింది. ఈ సినిమా విడుదల తేదీని స్వయంగా నిర్మాత దిల్ రాజు ప్రకటించారు. ఈ రోజు జరిగిన రాయన్ సినిమా ప్రీ-రిలీజ్ ఫంక్షన్ కు ప్రత్యేక అతిథిగా హాజరైన దిల్ రాజు, గేమ్ ఛేంజర్ సినిమాను క్రిస్మక్ కానుకగా విడుదల చేస్తున్నట్టు ప్రకటించారు.

శంకర్ దర్శకత్వంలో తెరకెక్కుతోంది గేమ్ ఛేంజర్ సినిమా. శంకర్ కు ఇదే తొలి తెలుగు సినిమా. అటు ఆర్ఆర్ఆర్ లాంటి బ్లాక్ బస్టర్ తర్వాత చరణ్ నటిస్తున్న సినిమా కూడా ఇదే. అంతేకాదు, దిల్ రాజుకు కెరీర్ లో ప్రతిష్టాత్మక 50వ చిత్రం ఇది.

అందుకే గేమ్ ఛేంజర్ పై అంచనాలు పెరిగాయి. కియరా అద్వానీ హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాకు తమన్ సంగీతం అందిస్తున్నాడు. ఇప్పటికే ఓ సాంగ్ రిలీజైంది.

 

Ramcharan,Game Changer,Christmas Release,Dil Raju