Gangs Of Godavari | మళ్లీ వాయిదాపడిన విశ్వక్ సేన్ సినిమా

 

2024-05-09 17:30:35.0

https://www.teluguglobal.com/h-upload/2024/05/09/1326364-gangs-of-godavari-1.webp

Gangs Of Godavari – గతేడాది రిలీజ్ అవ్వాల్సిన సినిమా గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి. ఈ సినిమా ఇప్పుడు మరోసారి వాయిదా పడింది.

విశ్వక్ సేన్ హీరోగా “గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి” సినిమా రెడీ అయింది. ఇందులో ఆయన “లంకల రత్న” అనే ఒక బలమైన పాత్రలో కనువిందు చేయనున్నాడు.

ఈ సినిమాకి కృష్ణ చైతన్య కథ అందిస్తూ దర్శకత్వం వహిస్తున్నాడు. సితార ఎంటర్‌టైన్‌మెంట్స్‌, ఫార్చ్యూన్‌ఫోర్ సినిమాస్‌ బ్యానర్లపై సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య భారీస్థాయిలో నిర్మిస్తున్నారు.

“ఫలక్‌నుమా దాస్‌”తో పెద్ద హిట్ అందుకున్నాడు విశ్వక్ సేన్. అందుకే ‘గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి’ సినిమాను కూడా ఫలక్ నుమా దాస్ విడుదలైన తేదీకే రిలీజ్ చేయాలని నిర్ణయించారు. ఈ మేరకు సినిమాను వాయిదా వేశారు.

లెక్కప్రకారం, గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి సినిమా 17న రిలీజ్ అవ్వాలి. కానీ ఇది 31వ తేదీకి వాయిదా పడింది. ప్రముఖ స్వరకర్త యువన్ శంకర్ రాజా ఈ చిత్రానికి సంగీతం సమకూరుస్తున్నారు. ఇక ఈ ఆల్బమ్‌లోని “సుట్టంలా సూసి” అనే మెలోడియస్ సాంగ్ ఇప్పటికే వైరల్‌గా మారింది. నటి నేహా శెట్టి హీరోయిన్ గా నటిస్తున్న ఈ చిత్రంలో, ప్రముఖ నటి అంజలి కీలక పాత్ర పోషిస్తోంది. 

 

Gangs Of Godavari,postponed,Vishwaksen,neha shetty