2024-08-25 17:18:18.0
https://www.teluguglobal.com/h-upload/2024/08/25/1354726-mahesh-family.webp
Gautham’s debut – గౌతమ్ ఘట్టమనేని హీరోగా వచ్చేందుకు ఫిక్స్ అయ్యాడు. ఆ వివరాల్ని సితార వెల్లడించింది.
బాలకృష్ణ కొడుకు మోక్షజ్ఞ సినిమాల్లోకి వస్తున్నాడు. ఆల్రెడీ ప్రాజెక్ట్ కూడా లాక్ అయింది. పవన్ కల్యాణ్ కొడుకు అకీరా నందన్ కూడా సినిమాల్లోకి వస్తున్నాడు. అనధికారికంగా ఈ విషయాన్ని ప్రకటించేశారు. ప్రస్తుతం అకిరా, యాక్టింగ్ కోర్స్ కూడా చేస్తున్నాడు. మరి మహేష్ బాబు కొడుకు గౌతమ్ సంగతేంటి?
దీనిపై మహేష్ ఎప్పుడూ ప్రకటన చేయలేదు. అతడు చదువుకుంటున్నాడని, సినిమాల్లోకి వస్తాడా రాడా అనేది పూర్తిగా అతడి నిర్ణయమేనని, తాము ఒత్తిడి చేయడం లేదని, మహేష్-నమ్రతా ఎన్నో సందర్భాల్లో చెప్పుకొచ్చారు.
అయితే మహేష్ కూతురు, గౌతమ్ చెల్లెలు సితార మాత్రం ఇలాంటి డొంకతిరుగుడు సమాధానాలివ్వలేదు. గౌతమ్ డెబ్యూపై సూటిగా స్పందించింది సితార. సినిమాల్లోకి రావాలని గౌతమ్ బలంగా కోరుకుంటున్నాడని సితార తెలిపింది.
కచ్చితంగా అన్నయ్య సినిమాల్లోకి వస్తాడని తేల్చి చెప్పేసింది. అంతేకాదు.. దీని కోసం న్యూయార్క్ ఫిలిం అకాడమీలో నాలుగేళ్ల పాటు యాక్టింగ్ కోర్స్ కూడా చేయబోతున్నట్టు సితార వెల్లడించింది. సో.. మరో నాలుగేళ్ల తర్వాత గౌతమ్ టాలీవుడ్ ఎంట్రీ ఉంటుందన్నమాట.
Sithara,Gautham,Mahesh babu