GOAT Movie | మైత్రీ చేతికి మరో పెద్ద సినిమా

 

2024-07-09 08:12:11.0

https://www.teluguglobal.com/h-upload/2024/07/09/1342843-goat-telugu-distribution-1.webp

GOAT Movie – విజయ్ ద్విపాత్రాభినయం చేస్తున్న సినిమా గోట్. ఈ సినిమా తెలుగు హక్కుల్ని ‘మైత్రీ’ సంస్థ దక్కించుకుంది.

దళపతి విజయ్, వెంకట్ ప్రభు కాంబోలో వస్తున్న సినిమా “ది గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ టైమ్”. ఏజీఎస్ ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్ పై తెరకెక్కుతున్న ఈ సినిమాపై భారీ అంచనాలున్నాయి. మరీ ముఖ్యంగా విజయ్ కెరీర్ లో చివరి చిత్రం ఇదే అనే అంచనాల మధ్య సినిమా కోసం అతడి ఫ్యాన్స్ ఆత్రుతగా ఎదురుచూస్తున్నారు.

ఇప్పటికే విడుదలైన ప్రమోషనల్ కంటెంట్ తో నేషనల్ వైడ్ గా భారీ బజ్ క్రియేట్ చేసిన ఈ సినిమా ఆంధ్ర, తెలంగాణ డిస్ట్రిబ్యూషన్ రైట్స్ ని మైత్రీ మూవీ డిస్ట్రిబ్యూటర్స్ సొంతం చేసుకుంది. రెండు తెలుగు రాష్ట్రాలలో గ్రాండ్ గా ఈ సినిమాను విడుదల చేయనుంది.

ఈ పాన్ ఇండియా ఎంటర్ టైనర్ లో విజయ్ సరసన మీనాక్షి చౌదరి హీరోయిన్ గా నటిస్తోంది. ప్రశాంత్, ప్రభుదేవా, మోహన్, జయరామ్, స్నేహ, లైలా ఇతర కీలక పాత్రలు పోషిస్తున్నారు. సెన్సేషనల్ కంపోజర్ యువన్ శంకర్ రాజా మ్యూజిక్ అందిస్తున్నాడు. త్వరలోనే గోట్ విడుదల తేదీని ప్రకటిస్తారు.

 

Mythri Distribution,GOAT Movie,Hero Vijay