2024-04-06 09:09:44.0
Gold Price India: భారత్‌లోని వివిధ నగరాల పరిధిలో ఆభరణాల తయారీకి వినియోగించే 22 క్యారట్ల బంగారం తులం ధర శనివారం రూ.1200 పుంజుకుని రూ.65,350లకు దూసుకెళ్తే, 24 క్యారట్ల బంగారం ధర రూ.1310 వృద్ధితో రూ.71,290 పలికింది.
Gold Rates | త్వరలో కీలక వడ్డీరేట్లు తగ్గిస్తామని యూఎస్ ఫెడ్ రిజర్వ్ చైర్మన్ జెరోమ్ పావెల్ ప్రకటించడం, ఆర్థిక రంగంలో అనిశ్చితికి తోడు ఇప్పటికీ ద్రవ్యోల్బణం ఆందోళనకర స్థాయిలోనే కొనసాగుతుండటం.. భారత్‌లో పెండ్లిండ్ల సీజన్ కావడంతో బంగారం ధరలకు రెక్కలొచ్చాయి. కొత్త ఆర్థిక సంవత్సరం (2024-25) మొదటి నెల ఏప్రిల్‌లో ఆరు రోజుల్లోనే ఆభరణాల తయారీకి వినియోగించే 22 క్యారట్ల బంగారం రూ.3,300 పెరిగింది. శనివారం భారత్ బులియన్ మార్కెట్లో తులం బంగారం (24 క్యారట్లు) ధర రూ.3600 వృద్ధి చెందింది. ఇంతకుముందు మార్చి 29న బంగారం (24 క్యారట్లు) తులం ధర రూ.1420, ఆభరణాల తయారీకి వినియోగించే 22 క్యారట్ల బంగారం ధర తులం రూ.1300 పెరిగి ఆల్ టైం గరిష్ట స్థాయి నమోదు చేసింది.
భారత్‌లోని వివిధ నగరాల పరిధిలో ఆభరణాల తయారీకి వినియోగించే 22 క్యారట్ల బంగారం తులం ధర శనివారం రూ.1200 పుంజుకుని రూ.65,350లకు దూసుకెళ్తే, 24 క్యారట్ల బంగారం ధర రూ.1310 వృద్ధితో రూ.71,290 పలికింది.
అంతర్జాతీయ మార్కెట్లలోనూ బంగారం ధరలు ధగధగ మెరుస్తున్నాయి. స్పాట్ గోల్డ్ ఔన్స్ ధర నూతన రికార్డులు నెలకొల్పింది. శనివారం స్పాట్ గోల్డ్ ధర ఔన్స్ 2304.49 డాలర్ల ఆల్‌టైం గరిష్ట స్థాయిని చేరుకుని 2304.09 డాలర్లకు దిగి వచ్చింది. యూఎస్ గోల్డ్ ఫ్యూచర్స్ ఔన్స్ ధర సైతం 2309.5 డాలర్ల వద్ద స్థిర పడింది.
బంగారం బాటలోనే వెండి ధరలు కొనసాగుతున్నాయి. శనివారం కిలో వెండి ధర రూ.1800 పెరిగి రూ.83,500 పలుకుతుంది.
దేశంలోని ప్రధాన నగరాల్లో బంగారం ధరవరలు ఇలా
తమిళనాడు రాష్ట్ర రాజధాని చెన్నైలో ఆభరణాల తయారీకి వినియోగించే 22 క్యారట్ల బంగారం తులం ధర రూ.66,150, 24 క్యారట్ల బంగారం ధర రూ.72,160 వరకూ దూసుకెళ్లింది.
దేశ ఆర్థిక రాజధానిగా పేరొందిన ముంబై నగరంలో 22 క్యారట్ల బంగారం ధర రూ.65,350 వద్ద స్థిర పడితే, 24 క్యారట్ల బంగారం తులం ధర రూ.71,290 వద్ద ముగిసింది. కిలో వెండి ధర రూ.1800 వృద్ధి చెంది, రూ.83,500 వరకూ చేరుకున్నది. కిలో వెండి ధర రూ.2000 వృద్ధి చెంది, రూ.87,000 వరకూ చేరుకున్నది.
దేశ రాజధాని ఢిల్లీలో ఆభరణాల తయారీకి వినియోగించే 10 గ్రాముల (22 క్యారట్లు) బంగారం ధర రూ.65,500, 24 క్యారట్ల బంగారం తులం ధర రూ.71,440 పలికింది. కిలో వెండి ధర రూ.1800 వృద్ధి చెంది, రూ.83,500 వరకూ చేరుకున్నది.
పశ్చిమ బెంగాల్ రాష్ట్ర రాజధాని కోల్‌కతాలో ఆభరణాల తయారీకి వినియోగించే 22 క్యారట్ల బంగారం తులం ధర రూ.65,350 పలికితే, 24 క్యారట్ల బంగారం తులం రూ.71,290 వద్ద స్థిర పడింది. కిలో వెండి ధర రూ.1800 వృద్ధి చెంది, రూ.83,500 వరకూ చేరుకున్నది.
కర్ణాటక రాష్ట్ర రాజధాని బెంగళూరు నగరంలో ఆభరణాల తయారీకి వాడే 22 క్యారట్ల బంగారం తులం ధర రూ.1200 పెరిగి రూ.65,350 వద్ద నిలిచింది. ఇక 24 క్యారట్ల బంగారం తులం ధర రూ.1310 వృద్ధి చెంది రూ.71,290 వద్ద స్థిర పడింది. కిలో వెండి ధర రూ.500 పెరిగి రూ.82 వేల వద్ద ముగిసింది.
తెలంగాణ రాష్ట్ర రాజధాని హైదరాబాద్ నగరంలో ఆభరణాల తయారీకి వినియోగించే 22 క్యారట్ల బంగారం తులం ధర రూ.1200 పెరిగి రూ.65,350 వద్ద స్థిర పడితే, 24 క్యారట్ల బంగారం తులం రూ.71,290 వద్ద ముగిసింది. కిలో వెండి ధర రూ.2000 వృద్ధి చెంది రూ.87 వేలకు దూసుకెళ్లింది.
Gold Rates in Hyderabad,Gold,Gold Prices,Gold Rate,India gold prices