2024-04-19 10:02:59.0
ఏరోజుకారోజు బంగారం, వెండి ధరలు ఆల్‌టైం గరిష్ట ధరలు నమోదు చేస్తున్నాయి. శుక్రవారం తమిళనాడు రాష్ట్ర రాజధాని చెన్నైలో 24 క్యారట్ల బంగారం తులం ధర రూ.600 వృద్ధి చెంది రూ.75,160 పలుకుతున్నది.
Gold Rates | ఇటు ఇజ్రాయెల్-ఇరాన్ మధ్య యుద్ధ మేఘాల.. అటు ఉక్రెయిన్-రష్యా మధ్య రెండేండ్లుగా సాగుతున్న యుద్దం.. మరోవైపు కరోనా తర్వాత పెరిగిపోయిన ద్రవ్యోల్బణాన్ని కట్టడి చేసేందుకు పెంచిన వడ్డీరేట్లతో అంతర్జాతీయంగా వెంటాడుతున్న ఆర్థిక మాంద్యం.. ద్రవ్య లభ్యత కోసం వడ్డీరేట్లు తగ్గించే అవకాశాలు సన్నగిల్లడంతో ఇన్వెస్టర్లు ఆల్టర్నేటివ్ పెట్టుబడి మార్గంగా బంగారంపై మదుపు చేస్తున్నారు.
ఇక బంగారం అంటే భారతీయులకు అందునా మహిళలకు ఎంతో ఇష్టం. ప్రతి పండక్కి, పర్వదినాలకు, కుటుంబ వేడుకలకు బంగారం కొనుగోలు చేయడానికి ప్రాధాన్యం ఇస్తుంటారు. తమ ఆభరణాలు ధరించడానికే అతివలు మొగ్గు చూపుతుంటారు. దీనికి తోడు ప్రస్తుతం పెండ్లిండ్ల సీజన్ కావడంతో ఫలితంగా అంతర్జాతీయ మార్కెట్‌తోపాటు దేశీయ బులియన్ మార్కెట్‌లో బంగారం, వెండి ధరలకు రెక్కలొచ్చేస్తున్నాయి. ఏరోజుకారోజు బంగారం, వెండి ధరలు ఆల్‌టైం గరిష్ట ధరలు నమోదు చేస్తున్నాయి. శుక్రవారం తమిళనాడు రాష్ట్ర రాజధాని చెన్నైలో 24 క్యారట్ల బంగారం తులం ధర రూ.600 వృద్ధి చెంది రూ.75,160 పలుకుతున్నది. సుంకాలు, తయారీ ఖర్చు, జీఎస్టీ అన్నీ కలుపుకుంటే రూ.76,285కు చేరుతుంది. ఆభరణాల తయారీకి వినియోగించే 22 క్యారట్ల బంగారం తులం ధర సైతం రూ.550 వృద్ధితో రూ.68,900 వద్ద స్థిర పడింది. కిలో వెండి ధర రూ.90వేలకు చేరుకున్నది. దేశవ్యాప్తంగా వివిధ నగరాల్లో బంగారం, వెండి ధరల గురించి తెలుసుకుందాం..!
నగరం — — 22 క్యారట్స్ – 24 క్యారట్స్ (రూ.ల్లో)
చెన్నై —- — 68,900 — — 75,160
ముంబై — — 68,150 — – 74,340
ఢిల్లీ —– —– 68,300 — — 74,490
కోల్‌కతా — — 68,150 – 74,340
బెంగళూరు — 68,150 – 74,340
హైదరాబాద్ — 68,150 -74,340
కేరళ —— — 68,150 – 74,340
పుణె —- ——– 68,150 — 74,340
వడోదర —- 68,200 — 74,390
అహ్మదాబాద్ —- 68,200 – 74,390
జైపూర్ —- 68,300 —- 74,490
లక్నో —- 68,300 —-74,490
కోయంబత్తూర్ —- 68,900 —- 75,160
మదురై —- 68,900 —- 75,160
విజయవాడ – 68,150 – 74,340
పాట్నా —- 68,200 —- 74,390
నాగ్‌పూర్ —- 68,150 – 74,340
చండీగఢ్ —- 68,300 – 74,490
సూరత్ —- 68,200 —- 74,390
భువనేశ్వర్ – 68,150 —- 74,340
మంగళూరు – 68,150 —- 74,340
విశాఖపట్నం —- 68,150 — 74340
నాసిక్ —- 67,670 —- 74,370
మైసూర్ —- 68,150 —- 74,340
సేలం —- 68,900 —- 75,160
రాజ్‌కోట్ —- 68,200 —-74,390
త్రిచి —- 68,900 —- 75,160
అయోధ్య —- 68,300 —-74,490
కటక్ —- 68,150 —- 74,340
దేవనగిరె —- 68,150 —- 74,340
బళ్లారి —- 68,150 —- 74,340
గుర్‌గామ్ —- 68,300 —-74,490
ఘజియాబాద్ —- 68,300 —-74,490
నోయిడా —- 68,300 —- 74,490
వేలూరు —- 68,900 —- 75,160
అమరావతి —- 68,150 —- 74,340
గుంటూరు —- 68,150 —- 74,340
నెల్లూరు —- 68,150 —- 74,340
కాకినాడ —- 68,150 —- 74,340
తిరుపతి —- 68,150 —- 74,340
కడప ——– 68,150 —- 74,340
అనంతపురం – 68,150 —- 74,340
వరంగల్ —- 68,150 —- 74,340
నిజామాబాద్ – 68,150 — 74,340
ఖమ్మం —- 68,150 —– 74,340
బర్హంపూర్—- 68,150 —- 74,340
రూర్కేలా —- 68,150 —-74,340
వాసాయి విరార్ – 67,670 -74,370
ఔరంగాబాద్ – 68,150-74,340
షోలాపూర్ – 68,150 -74,340
Tamil Nadu,Chennai,Gold Rate,Gold