Google Pixel 8 Pro | 256 జీబీ స్టోరేజీ వేరియంట్‌లో గూగుల్ పిక్సెల్ 8 ప్రో ఆవిష్క‌ర‌ణ‌.. ఇవీ బ్యాంకు ఆఫ‌ర్లు..!

https://www.teluguglobal.com/h-upload/2023/11/04/500x300_851083-google-pixel-8-pro.webp

2023-11-04 10:27:16.0

Google Pixel 8 Pro | గూగుల్ పిక్సెల్ 8 ప్రో (Google Pixel 8 Pro) ఫోన్ గ‌త నెల నాలుగో తేదీన గూగుల్ 2023 ఈవెంట్ ద్వారా భార‌త్ మార్కెట్లో ఆవిష్క‌రించింది.

Google Pixel 8 Pro | గూగుల్ పిక్సెల్ 8 ప్రో (Google Pixel 8 Pro) ఫోన్ గ‌త నెల నాలుగో తేదీన గూగుల్ 2023 ఈవెంట్ ద్వారా భార‌త్ మార్కెట్లో ఆవిష్క‌రించింది. గూగుల్ పిక్సెల్ 8 (Google Pixel 8)తోపాటు గ‌త నెల 12 నుంచి సేల్స్ ప్రారంభం అయ్యాయి. లాంచింగ్ టైంలో 12 జీబీ ర్యామ్ విత్ 128 జీబీ ఇంట‌ర్న‌ల్ స్టోరేజీ వేరియంట్‌తో వ‌చ్చిన గూగుల్ పిక్సెల్ 8 ప్రో (Google Pixel 8 Pro) ఫోన్ ధ‌ర రూ.1,06,999గా నిర్ణ‌యించారు. గూగుల్ పిక్సెల్ 8 ప్రో (Google Pixel 8 Pro) ఫోన్ మూడు రంగుల్లో ల‌భిస్తుంది. బే (Bay), ఒబ్సిడియ‌న్ (Obsidian), పోర్సెలియ‌న్ (Porcelain) రంగుల్లో అందుబాటులోకి వ‌చ్చిన గూగుల్ పిక్సెల్ 8 ప్రో (Google Pixel 8 Pro) ఫోన్ ఇప్పుడు కొత్త స్టోరేజీ వేరియంట్‌తో ఆవిష్క‌రించింది గూగుల్.

గూగుల్ పిక్సెల్ 8 ప్రో (Google Pixel 8 Pro) ఫోన్ 12 జీబీ ర్యామ్ విత్ 256 జీబీ ఇంట‌ర్న‌ల్ స్టోరేజీ వేరియంట్‌తో మార్కెట్లో అందుబాటులో ఉంటుంది. ఈ ఫోన్ ధ‌ర రూ.1,13,999గా నిర్ణ‌యించింది. ఆస‌క్తి గ‌ల కొనుగోలుగారుల‌కు బ్యాంకు ఆఫ‌ర్లు కూడా అందుబాటులో ఉన్నాయి. ఎస్బీఐ క్రెడిట్ కార్డుతో కొనుగోలు చేస్తే రూ.9,000, ఎక్స్చేంజ్ బోన‌స్ కింద రూ.4000 ధ‌ర త‌గ్గిస్తారు.

భార‌త్ మార్కెట్‌లో గూగుల్ పిక్సెల్ 8 ప్రో (Google Pixel 8 Pro) ఫోన్ కేవ‌లం ఒబ్సిడియ‌న్ (Obsidian) క‌ల‌ర్‌లో మాత్ర‌మే ల‌భిస్తుంది. మూడు క‌ల‌ర్ ఆప్ష‌న్ల‌తోపాటు 12 జీబీ ర్యామ్ విత్ 128 జీబీ ఇంట‌ర్న‌ల్ స్టోరేజీ వేరియంట్ ఫోన్ ధ‌ర రూ.1,06,999 కాగా, ఎస్బీఐ బ్యాంక్ క్రెడిట్ కార్డు ఆఫ‌ర్‌, ఎక్స్చేంజ్ బోన‌స్ య‌థాతధంగా పొందొచ్చు.

గూగుల్ పిక్సెల్ 8 ప్రో (Google Pixel 8 Pro) ఫోన్ ఆండ్రాయిడ్ 14 ఔటాఫ్ బాక్స్ (Android 14 out-of-the-box) వ‌ర్ష‌న్‌పై ప‌ని చేస్తుంది. ఈ ఫోన్‌ 6.7- అంగుళాల క్వాడ్ హెచ్డీ (1,344×2,992 పిక్సెల్స్‌) స్క్రీన్ విత్ 120 హెర్ట్జ్ రీఫ్రెష్ రేట్‌తో వ‌స్తుంది. గూగుల్ పిక్సెల్ 8 ప్రో (Google Pixel 8 Pro) ఫోన్ గూగుల్స్ టెన్స‌ర్ జీ3 ఎస్వోసీ, టైటాన్ ఎం2 సెక్యూరిటీ చిప్‌తో వ‌స్తోంది.

గూగుల్ పిక్సెల్ 8 ప్రో (Google Pixel 8 Pro) ఫోన్ ట్రిపుల్ రేర్ కెమెరా యూనిట్ క‌లిగి ఉంటుంది. 50-మెగా పిక్సెల్ మెయిన్ సెన్స‌ర్ కెమెరాతోపాటు రెండు 48-మెగా పిక్సెల్ సెన్స‌ర్ కెమెరాల‌తో వ‌స్తుంది. సెల్ఫీలూ వీడియో కాల్స్ కోసం 10.5 మెగా పిక్సెల్ ఫ్రంట్ కెమెరా ఉంటుంది. 30 వాట్ల వైర్డ్ ఫాస్ట్ చార్జింగ్ మ‌ద్ద‌తుతో 5050 ఎంఏహెచ్ కెపాసిటీ గ‌ల బ్యాట‌రీతో వ‌స్తోంది.

Google Pixel 8 Pro,Bank Offers,Smartphone,Google

https://www.teluguglobal.com//science-tech/google-pixel-8-pro-now-available-in-256gb-storage-variant-check-bank-offers-972079