2024-05-15 17:52:34.0
https://www.teluguglobal.com/h-upload/2024/05/15/1327961-gv-prakash.webp
GV Prakash – సంగీత దర్శకుడు జీవీ ప్రకాష్ తన భార్య నుంచి విడాకులు తీసుకున్నాడు. తామిద్దరం విడిపోయినట్టు ప్రకటించాడు.
కోలీవుడ్ లో మరో బ్రేకప్. సంగీత దర్శకుడు, నటుడు జీవీ ప్రకాష్ కుమార్, అతడి భార్య విడిపోయారు. ఈ విషయాన్ని వాళ్లు స్వయంగా ప్రకటించారు. తామిద్దరం పరస్పర అంగీకారంతో విడిపోతున్నట్టు వీళ్లు వేర్వేరుగా ప్రకటించారు.
“మరింత సౌకర్యవంతమైన జీవితం కోసం, మానసిక ప్రశాంతత కోసం నేను సైంధవి విడిపోవాలని నిర్ణయించుకున్నాం. మా 11 ఏళ్ల వైవాహిక బంధానికి ముగింపు పలుకుతున్నాం. ఇది సరైన నిర్ణయమని మేమిద్దరం భావిస్తున్నాం. మీడియా మా నిర్ణయాన్ని అర్థం చేసుకొని, మా ప్రైవసీకి భంగం కలగకుండా వ్యవహరిస్తుందని ఆశిస్తున్నాం.” అంటూ పోస్ట్ పెట్టాడు జీవీ ప్రకాష్ కుమార్.
వీళ్లిద్దరు విడిపోవడం చాలామందికి షాక్. ఎందుకంటే, జీవీ ప్రకాష్, సైంధవి చిన్నప్పట్నుంచి ఫ్రెండ్స్. ఒకరి గురించి ఒకరికి బాగా తెలుసు. సంగీత దర్శకుడిగా జీవీ ప్రకాష్, గాయనిగా సైంధవి కలిసి ఎన్నో సంగీత విభావరిలు నిర్వహించారు. తర్వాత చాన్నాళ్ల పాటు ప్రేమించుకొని పెళ్లి చేసుకున్నారు. వీళ్లకు ఓ కూతురు కూడా ఉంది.
తమ పెళ్లి జరిగి దశాబ్ద కాలం పూర్తయిన సందర్భంగా సైంధవి గతేడాది ఓ పోస్ట్ కూడా పెట్టింది. తన భర్తను ఆకాశానికెత్తేసింది. అంతలోనే ఇద్దరి మధ్య అభిప్రాయబేధాలు రావడం, విడిపోవడం చకచకా జరిగిపోయాయి.
GV Prakash,Saindhavi,divorce