2024-08-08 17:51:06.0
https://www.teluguglobal.com/h-upload/2024/08/08/1350928-anupam-kher.webp
Hari Hara Veera Mallu: హరిహర వీరమల్లు (Hari Hara Veera Mallu) సినిమాకు మరో ఎట్రాక్షన్ వచ్చి చేరింది. అనుపమ్ ఖేర్ ఈ సినిమాలో జాయిన్ అయ్యారు.
పవన్ కళ్యాణ్ హీరోగా నటిస్తున్న పాన్ ఇండియా చిత్రం ‘హరి హర వీరమల్లు’. ఈ పీరియాడికల్ యాక్షన్ చిత్రానికి మరో అదనపు ఆకర్షణ తోడైంది. లెజెండరీ భారతీయ నటుల్లో ఒకరైన అనుపమ్ ఖేర్ ‘హరి హర వీరమల్లు’లో భాగమయ్యారు. ఈ చిత్రంలో ఆయన ఓ గౌరవనీయమైన పాత్ర పోషిస్తున్నారు.
పవన్ కళ్యాణ్ తొలిసారిగా లెజెండరీ నటుడు అనుపమ్ ఖేర్ తో తెరను పంచుకోబోతున్నారు. ఈ ఇద్దరు అగ్ర నటుల కలయికలో వచ్చే సన్నివేశాలు సినిమాకి ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తాయంటున్నాడు దర్శకుడు జ్యోతి కృష్ణ.
రెండు భాగాలుగా రాబోతోంది హరిహర వీరమల్లు. మొదటి భాగంలో పెండింగ్ వర్క్ తో పాటు, రెండో భాగం మొత్తాన్ని జ్యోతికృష్ణ తెరకెక్కించబోతున్నాడు. స్క్రిప్ట్, లొకేషన్స్ తో యూనిట్ సిద్ధంగా ఉంది. పవన్ ఎప్పుడు కాల్షీట్ ఇస్తే అప్పుడు మూవీ సెట్స్ పైకి వస్తుంది.
ప్రముఖ ఛాయాగ్రాహకుడు మనోజ్ పరమహంస ఈ చిత్రం యొక్క మిగిలిన భాగం చిత్రీకరణ పూర్తి చేయడం కోసం సాంకేతికత బృందంలో చేరాడు. లెజెండరీ కళా దర్శకుడు తోట తరణి, వీఎఫ్ఎక్స్ సూపర్‌వైజర్, బాహుబలి ఫేమ్ శ్రీనివాస్ మోహన్ వంటి దిగ్గజాలు ఈ చిత్రం కోసం పని చేస్తున్నారు.
ప్రముఖ నిర్మాత ఏ.ఎం.రత్నం సమర్పణలో మెగా సూర్య ప్రొడక్షన్స్ పతాకంపై ఎ.దయాకర్ రావు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఆస్కార్ విజేత ఎం.ఎం. కీరవాణి సంగీతం అందిస్తున్నారు.
Anupam Kher,Pawan Kalyan,Hari Hara Veera Mallu