Hari Hara Veeramallu | పవన్ సినిమా టీజర్ రిలీజ్

 

2024-05-02 17:37:03.0

https://www.teluguglobal.com/h-upload/2024/05/02/1324269-hari-hara-veeramallu-1.webp

Hari Hara Veeramallu Teaser – పవన్ హీరోగా నటిస్తున్న సినిమా హరిహర వీరమల్లు. ఈ మూవీ టీజర్ రిలీజైంది.

పవన్ కళ్యాణ్ తన కెరీర్‌లో మొదటిసారిగా ‘హరి హర వీర మల్లు’ అనే పీరియాడికల్ యాక్షన్ అడ్వెంచర్‌ సినిమాలో నటిస్తున్న సంగతి తెలిసిందే. మెగా సూర్య ప్రొడక్షన్స్‌ బ్యానర్ పై ప్రముఖ నిర్మాత ఏఎం రత్నం అత్యంత భారీ బడ్జెట్ తో ప్రతిష్టాత్మకంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.

17వ శతాబ్దంలో పేదల పక్షాన పోరాడిన ఒక యోధుడి కథగా రూపొందుతోన్న ఈ యాక్షన్‌ అడ్వెంచర్ చిత్రం కోసం, నిర్మాతలు ప్రత్యేకంగా చార్మినార్, ఎర్రకోట, మచిలీపట్నం ఓడరేవు వంటి భారీ సెట్‌లను అంతర్జాతీయ స్థాయి నిర్మాణ విలువలతో ఎక్కడా రాజీ పడకుండా నిర్మించారు.

ఈ చిత్రం 2 భాగాలుగా రానుందని ప్రకటిస్తూ, మొదటి భాగం నుండి టీజర్‌ను విడుదల చేశారు మేకర్స్. మొదటి భాగం “హరి హర వీరమల్లు పార్ట్-1: స్వార్డ్ వర్సెస్ స్పిరిట్” పేరుతో ప్రేక్షకుల ముందుకు రానుంది. “ధర్మం కోసం యుద్ధం” అనేది ఉపశీర్షిక.

పేదలు దోపిడీకి గురవుతూ, ధనవంతులు మరింత అభివృద్ధి చెందుతున్న ప్రాంతంలో.. న్యాయం కోసం యుద్ధం చేసే ఒంటరి యోధుడుగా పవన్ కళ్యాణ్ పోషిస్తున్న ‘హరి హర వీరమల్లు’ పాత్రను టీజర్ లో చూపించారు. కళ్ళు చెదిరే విజువల్స్, భారీ సెట్లు, కీరవాణి అద్భుతమైన నేపథ్య సంగీతం టీజర్ లో హైలెట్ గా నిలిచాయి.

టీజర్ విడుదల సందర్భంగా, నిర్మాతలు ఒక కీలక ప్రకటన చేశారు. “ఎనక్కు 20 ఉనక్కు 18”, “నీ మనసు నాకు తెలుసు”, “ఆక్సిజన్” వంటి చిత్రాలకు దర్శకత్వం వహించి, కొన్ని చిత్రాలకు రచయితగా కూడా పనిచేసిన రచయిత-దర్శకుడు జ్యోతి కృష్ణ, ‘హరి హర వీరమల్లు’ చిత్రం మిగిలిన షూటింగ్ ను, పోస్ట్ ప్రొడక్షన్ పనులను క్రిష్ జాగర్లమూడి పర్యవేక్షణలో పూర్తి చేయబోతున్నాడు.

 

Pawan Kalyan,Hari Hara Veeramallu Teaser,AM Ratnam,Krish