Hari Hara Veeramallu | పవన్ సినిమా షూటింగ్ అప్ డేట్స్

 

2024-06-01 17:28:16.0

https://www.teluguglobal.com/h-upload/2023/09/02/819141-hari-hara-1.webp

Hari Hara Veeramallu – పవన్ కల్యాణ్ హీరోగా నటిస్తున్న సినిమా హరిహర వీరమల్లు. ఈ సినిమా కొత్త షెడ్యూల్ కు రంగం సిద్ధమౌతోంది.

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తన కెరీర్‌లో తొలిసారిగా హిస్టారికల్ వారియర్ మూవీ చేస్తున్నాడు. అదే “హరిహర వీరమల్లు”. ఇందులో అతడు యోధుడిగా కనిపించబోతున్నాడు. దర్శకుడు జ్యోతి కృష్ణ, ఈ సినిమా బ్యాలెన్స్ షూట్ ను పూర్తిచేయబోతున్నాడు. అది కూడా క్రిష్ పర్యవేక్షణలో. మెగా సూర్య ప్రొడక్షన్స్‌ బ్యానర్ పై ప్రముఖ నిర్మాత ఏఎం రత్నం అత్యంత భారీ బడ్జెట్ తో ప్రతిష్టాత్మకంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.

17వ శతాబ్దంలో పేదల పక్షాన పోరాడిన ఒక యోధుడి కథగా రూపొందుతోన్న ఈ యాక్షన్‌ అడ్వెంచర్ చిత్రం కోసం, నిర్మాతలు ప్రత్యేకంగా చార్మినార్, ఎర్రకోట సహా మచిలీపట్నం ఓడరేవు వంటి భారీ సెట్‌లను అంతర్జాతీయ స్థాయిలో నిర్మించారు.

ఇక ఈ సినిమా అప్ డేట్స్ విషయానికొస్తే, ఈ ప్రాజెక్ట్ నుంచి డీవోపీ జ్ఞానశేఖర్ తప్పుకున్నారు. అతడి స్థానంలో కొత్త డీవోపీగా మనోజ్ పరమహంస బాధ్యతలు స్వీకరించాడు. త్వరలోనే ఈ సినిమా షూటింగ్ ను ప్రారంభించే పనిలో పడ్డారు. అందులో భాగంగానే నిర్మాత ఏం రత్నం, దర్శకుడు జ్యోతి కృష్ణతో పాటు ప్రొడక్షన్ డిజైనర్ తోట తరణి, విఎఫ్ఎక్స్ సూపర్వైజర్ శ్రీనివాస్ మోహన్‌లతో మనోజ్ పరమహంస చర్చిస్తున్న ఒక ఫోటోని చిత్ర యూనిట్ అధికారికంగా విడుదల చేసింది.

అంతేకాదు సినిమాకి సంబంధించిన షూటింగ్ త్వరితగతిన పూర్తిచేసేందుకు కొత్త లొకేషన్ల కోసం రెక్కీ కూడా పూర్తి చేస్తోంది. మరోవైపు ఇప్పటివరకు షూట్ చేసిన సినిమాకి సంబంధించి వీఎఫ్ఎక్స్, పోస్ట్ ప్రొడక్షన్ పనుల్ని పూర్తిచేస్తోంది యూనిట్. ఈ ఏడాది చివరి నాటికి హరిహర వీరమల్లు పార్ట్-1 ను విడుదల చేయాలని టార్గెట్ గా పెట్టుకున్నారు.

 

Hari Hara Veeramallu,Shooting Updates,Pawan Kalyan