Harish Shankar | అది సీరియస్, ఇది ఎంటర్ టైన్ మెంట్

 

2024-08-14 16:57:40.0

https://www.teluguglobal.com/h-upload/2024/08/14/1352407-harish-shankar.webp

Harish Shankar – రైడ్ రీమేక్ గా వస్తోంది మిస్టర్ బచ్చన్. ఈ రెండు సినిమాల మధ్య తేడా చెప్పాడు హరీశ్ శంకర్.

మాస్ మహారాజా రవితేజ, మాస్ డైరెక్టర్ హరీష్ శంకర్ కాంబోలో వస్తున్న సినిమా ‘మిస్టర్ బచ్చన్’. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్‌పై టి.జి.విశ్వ ప్రసాద్ ఈ సినిమాని నిర్మించారు. ఇందులో రవితేజకు జోడిగా భాగ్యశ్రీ బోర్సే టాలీవుడ్ కు పరిచయమౌతోంది.

మిస్టర్ బచ్చన్ రేపు గ్రాండ్ గా థియేటర్లలోకి వస్తోంది. ఈరోజు సాయంత్రం నుంచే ఈ సినిమా ప్రీమియర్స్ మొదలయ్యాయి. ఈ నేపథ్యంలో డైరెక్టర్ హరీష్ శంకర్ విలేకరుల సమావేశంలో సినిమా విశేషాలని పంచుకున్నాడు.

“రైడ్ కు సీక్వెల్ గా వస్తోంది మిస్టర్ బచ్చన్. రైడ్ కాస్త సీరియస్ గా ఉంటుంది. ఫస్ట్ హాఫ్ సెకండ్ హాఫ్ ఒకటే బ్యాక్ డ్రాప్ లో నడుస్తుంది. అలా చూసినప్పుడు ఆడియన్స్ కి కొంచెం స్ట్రెస్ వస్తుంది. ఇందులో అది లేకుండా చేశాం. ఫస్ట్ హాఫ్ లో ఎంటర్ టైన్మెంట్ ఎలా వచ్చిందో సినిమా చూసిన వాళ్లకు అర్థమౌతుంది..”

మిక్కీ జే మేయర్ ఈ సినిమాకు సంగీతం అందించాడు. సినిమాలో పాటలు బాగున్నాయనే టాక్ ఇప్పటికే ప్రీమియర్స్ ద్వారా బయటకొచ్చింది. 

 

Harish Shankar,Mr Bachchan Movie,Raid Movie,Raviteja