2024-04-24 17:19:38.0
https://www.teluguglobal.com/h-upload/2024/04/24/1321925-harom-hara-1.webp
Harom Hara Movie – సుధీర్ బాబు హీరోగా నటిస్తున్న సినిమా హరోంహర. ఈ సినిమా నుంచి ఓ సింగిల్ రిలీజైంది.
సుధీర్ బాబు మోస్ట్ ఎవైటెడ్ మూవీ ‘హరోం హర’ మ్యూజిక్ ప్రమోషన్స్ మొదలయ్యాయి. మంచి మెలొడీతో ఈ ప్రచారం ప్రారంభమైంది. సెహరి ఫేమ్ జ్ఞానసాగర్ ద్వారక దర్శకత్వంలో ఎస్‌ఎస్‌సి (శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర సినిమాస్) బ్యానర్‌పై సుమంత్ నాయుడు నిర్మించిన ఈ యాక్షన్ థ్రిల్లర్ నుంచి సింగిల్‌ని ఈ రోజు విడుదల చేశారు.
చైతన్ భరద్వాజ్ స్వరపరిచిన ఈ పాట, కనులెందుకో అనే లిరిక్స్ తో సాగుతుంది. నిఖితా శ్రీవల్లి, చైతన్ భరద్వాజ్ ఈ మెలొడీని అద్భుతంగా అలపించారు. వెంగీ ఈ పాటకు ఆకట్టుకునే సాహిత్యాన్ని అందించాడు.
సుధీర్ బాబుని బయట కలవడం గురించి మాళవిక హింట్ ఇవ్వడంతో పాట ప్రారంభమవుతుంది. ఇద్దరూ కలిసి కొంత క్యాలిటీ టైం గడపడానికి వేర్వేరు ప్రదేశాలకు వెళ్లడంతో వారి ప్రేమ ప్రయాణం ప్రారంభమవుతుంది. పాటలో వారి కెమిస్ట్రీ బాగుంది. విజువల్స్ కూడా బాగున్నాయి.
ఈ సినిమా షూటింగ్ ఇటీవలే పూర్తయింది. పోస్ట్ ప్రొడక్షన్ పనులు కూడా శరవేగంగా జరుగుతున్నాయి. సినిమా విడుదల తేదీని త్వరలో అనౌన్స్ చేస్తారు మేకర్స్.
చిత్తూరు జిల్లా కుప్పంలో 1989 నాటి నేపథ్యంలో సాగే హరోం హర కథలో సుధీర్ బాబు కుప్పం యాసలో డైలాగులు చెప్పనున్నారు. సునీల్ కీలక పాత్రలో నటించిన ఈ భారీ బడ్జెట్ చిత్రానికి ది రివోల్ట్ అనేది ట్యాగ్‌లైన్.
Melody Song,Sudheer Babu,Harom Hara Movie,Malavika Sharma