Harom hara | సుధీర్ బాబు సినిమా అప్ డేట్

 

2024-07-07 08:59:23.0

https://www.teluguglobal.com/h-upload/2024/06/14/1336395-harom-hara-movie.webp

Harom Hara – సుధీర్ బాబు తాజా చిత్రం హరోంహర. ఈ సినిమా రైట్స్ ఈటీవీ చేతికి వెళ్లాయి.

నవ దళపతి సుధీర్ బాబు లేటెస్ట్ మూవీ ‘హరోం హర’. శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర సినిమాస్ బ్యానర్‌పై సుమంత్ జి నాయుడు గ్రాండ్‌గా నిర్మించారు. జూన్ 14న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్ గా విడుదలైన హరోం హర సినిమా ఆశించిన స్థాయిలో ఆదరణ దక్కించుకోలేకపోయింది.

ఇప్పుడీ సినిమా ఓటీటీ-శాటిలైట్ లో అదృష్టాన్ని పరీక్షించుకోబోతోంది. తాజా సమాచారం ప్రకారం ఈటీవీ నెట్‌వర్క్ ఈ సినిమా డిజిటల్, శాటిలైట్ రైట్స్ సొంతం చేసుకుంది. త్వరలోనే ఈ సినిమాను ఈటీవీ విన్ యాప్ లో స్ట్రీమింగ్ కు పెట్టబోతున్నారు. అదే విధంగా సినిమాను ఈటీవీ ఛానెల్ లో ప్రసారం చేయబోతున్నారు. 12వ తేదీన ఈటీవీ విన్ లో ఈ సినిమా స్ట్రీమింగ్ కు వచ్చే అవకాశం ఉంది.

ఇంటెన్స్ యాక్షన్ థ్రిల్లర్ గా తెరకెక్కిన ఈ సినిమాకు సెహరి ఫేమ్ జ్ఞానసాగర్ ద్వారక దర్శకత్వం వహించాడు. మాళవిక శర్మ హీరోయిన్ గా నటించింది. చిత్తూరు జిల్లా కుప్పం నేపథ్యంలో 1989లో జరిగిన పీరియాడికల్ సినిమా ఇది.

ఇందులో తుపాకులు చేసే వ్యక్తిగా కనిపించాడు సుధీర్ బాబు. చైతన్ భరద్వాజ్ సంగీతం అందించగా, అరవింద్ విశ్వనాథన్ సినిమాటోగ్రఫీ అందించారు. సినిమా క్లిక్ అవ్వకపోయినా, ఫొటోగ్రఫీ, బ్యాక్ గ్రౌండ్ స్కోర్ కోసం ఓసారి చూడొచ్చు. 

 

Harom Hara,Non-Theatrical Rights,ETV WIN,Sudheer Babu