Harom Hara | సుధీర్ బాబు సినిమా షూటింగ్ అప్ డేట్స్

 

2024-04-21 08:30:58.0

https://www.teluguglobal.com/h-upload/2024/04/21/1320915-harom-hara-1.webp

Harom Hara – సుధీర్ బాబు హీరోగా నటిస్తున్న సినిమా హరోం హర. ఈ మూవీ షూటింగ్ అప్ డేట్స్ చెక్ చేద్దాం

సుధీర్ బాబు అప్ కమింగ్ యాక్షన్ థ్రిల్లర్ ‘హరోం హర’. సెహరి ఫేమ్ జ్ఞానసాగర్ ద్వారక దర్శకత్వంలో రూపొందుతున్న ఈ చిత్రం ప్రమోషనల్ కంటెంట్ కు మంచి రెస్పాన్స్ వచ్చింది. ముఖ్యంగా సుధీర్ బాబు పూర్తి యాక్షన్‌తో కూడిన లుక్ లో కనిపించి, సినిమాపై అంచనాలు పెంచాడు. ఎస్‌ఎస్‌సి బ్యానర్‌పై సుమంత్ జి నాయుడు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాడు.

ఈ సినిమా షూటింగ్ మొత్తం పూర్తయింది. ఈ సందర్భంగా సెట్‌లో కేక్‌ కట్‌ చేసి చిత్రబృందం సెలబ్రేట్ చేసుకుంది. వీడియోలో టీమ్ సంతృప్తిగా, కాన్ఫిడెంట్ గా కనిపిస్తోంది. ఈ సినిమా పోస్ట్ ప్రొడక్షన్ పనులు కూడా శరవేగంగా జరుగుతున్నాయి. త్వరలోనే విడుదల తేదీని ప్రకటించనున్నారు.

చిత్తూరు జిల్లా కుప్పంలో 1989 నాటి కథతో సాగే హరోం హర సినిమాలో సుధీర్ బాబు కుప్పం యాసలో డైలాగులు చెప్పనున్నాడు. ది రివోల్ట్ అనేది ట్యాగ్‌లైన్. ఇందులో సుధీర్ బాబుకు జోడీగా మాళవిక శర్మ నటిస్తోంది. సునీల్ ఓ కీలక పాత్రలో కనిపించనున్నారు. ఈ చిత్రానికి చైతన్ భరద్వాజ్ సంగీతం అందిస్తుండగా, అరవింద్ విశ్వనాథన్ సినిమాటోగ్రాఫర్. మాళవిక శర్మ హీరోయిన్. రీసెంట్ గా ఈమె భీమ సినిమాలో నటించింది.

 

Sudheer Babu,Harom hara,shooting updates