2022-12-02 03:27:12.0
Marriage dates in December 2022: సెప్టెంబర్ 22న ప్రారంభమైన మూఢం నవంబర్ 27 వరకు కొనసాగింది. దీంతో డిసెంబర్‌లో శుభ ముహూర్తాలకు డిమాండ్ ఏర్పడిందని పురోహితులు చెబుతున్నారు.
ఇకపై అన్నీ మంచి ముహూర్తాలే. శుక్రమౌఢ్యమి వల్ల 103 రోజులపాటు శుభకార్యాలకు బ్రేక్ పడిన విషయం తెలిసిందే. నేటితో అది తొలగిపోనుంది. ఈ శుభ తరుణం కోసం ఎదురుచూస్తున్న వందలాది కొత్త జంటలు ఇప్పుడు పెళ్లి బాజాల మధ్య ఒక్కటి కానున్నాయి. సాధారణంగా కార్తీక మాసంలో పెళ్లిళ్లు ఎక్కువగా జరిగేవి. కానీ ఈ ఏడాది కార్తీకంలో మూఢం రావడం వల్ల పెళ్లిళ్లతో పాటు గృహ ప్రవేశాల వంటి కార్యక్రమాలు కూడా జరగలేదు. సెప్టెంబర్ 22న ప్రారంభమైన మూఢం నవంబర్ 27 వరకు కొనసాగింది. దీంతో డిసెంబర్‌లో శుభ ముహూర్తాలకు డిమాండ్ ఏర్పడిందని పురోహితులు చెబుతున్నారు.
జోరుగా వ్యాపారాలు..
శుభ ముహూర్తాలు ప్రారంభం కానుండటంతో వాటికి సంబంధించిన వ్యాపార కార్యకలాపాలు ఇకపై జోరందుకోనున్నాయి. ఫ్లవర్ డెకరేటర్లు, స్వీట్ షాపులు, భజంత్రీలు, వంట మాస్టర్లు, పురోహితులు, ఫొటో, వీడియో గ్రాఫర్లు, కన్వెన్షన్లు, కల్యాణ మండపాలకు ఇక డిమాండ్ బాగా పెరగనుంది.
శుభ ముహూర్తాలు ఇలా..
– డిసెంబర్‌లో.. 2, 3, 4, 7, 8, 9, 10, 11, 12, 14, 15, 17, 18.
– జనవరిలో.. 23, 25, 26, 27, 28.
– ఫిబ్రవరిలో.. 1, 2, 3, 4, 6, 8, 9, 10, 11, 12, 15, 22, 23, 24, 27.
– మార్చిలో.. 1, 2, 3, 4, 6, 8, 9, 10, 11, 13, 17, 18, 22, 26.
– మార్చి 28 నుంచి ఏప్రిల్ 27 వరకు గురు మౌఢ్యమి.
– తిరిగి ఏప్రిల్ 28వ తేదీ నుంచి శుభ ముహూర్తాలు ప్రారంభమవుతాయి.
Wedding Season,Weddings,Marriage dates in December 2022,Hindu Panchang