https://www.teluguglobal.com/h-upload/2023/11/02/500x300_849945-home-loans.webp
2023-11-02 08:04:40.0
Home Loans | ప్రైవేట్ రంగ బ్యాంక్- ఐసీఐసీఐ బ్యాంక్, కేంద్ర ప్రభుత్వ రంగ బ్యాంక్.. బ్యాంక్ ఆఫ్ ఇండియా ఇండ్ల రుణాలపై వడ్డీరేట్లు పెంచేశాయి.
Home Loans | ప్రైవేట్ రంగ బ్యాంక్- ఐసీఐసీఐ బ్యాంక్, కేంద్ర ప్రభుత్వ రంగ బ్యాంక్.. బ్యాంక్ ఆఫ్ ఇండియా ఇండ్ల రుణాలపై వడ్డీరేట్లు పెంచేశాయి. వివిధ టెన్యూర్ల రుణాలపై మార్జినల్ కాస్ట్ బేస్డ్ లెండింగ్ రేట్లు (ఎంసీఎల్ఆర్) ఐదు బేసిక్ పాయింట్లు పెంచాయి. పెంచిన వడ్డీరేట్లు నవంబర్ ఒకటో తేదీ నుంచి అమల్లోకి వచ్చాయి. వినియోగదారుల అత్యధిక రుణాల్లో ఏడాది టెన్యూర్ రుణాలకు పెరిగిన వడ్డీరేట్లు వర్తిస్తాయి.
ఐసీఐసీఐ బ్యాంక్ అన్ని టెన్యూర్‌ల రుణాలపై ఐదు బేసిక్ పాయింట్ల ఎంసీఎల్ఆర్ పెంచేసింది. దీని ప్రకారం ఓవర్ నైట్- ఒక నెల టెన్యూర్ రుణంపై ఎంసీఎల్ఆర్ 8.50 శాతం, మూడు నెలలపై 8.55 శాతం, ఆరు నెలల టెన్యూర్ రుణాలపై 8.90 శాతం, ఏడాది టెన్యూర్ రుణంపై 9 శాతానికి ఎంసీఎల్ఆర్ పెంచేసింది.
రుణాలపై ఐసీఐసీఐ బ్యాంక్ వడ్డీరేట్లు ఇలా |
|
టెన్యూర్ | ఎంసీఎల్ఆర్ |
ఓవర్ నైట్ | 8.50 శాతం |
ఒక నెల | 8.50 శాతం |
3 నెలలు | 8.55 శాతం |
6 నెలలు | 8.90 శాతం |
ఏడాది | 9.00 శాతం |
ఇలా బ్యాంక్ ఆఫ్ ఇండియా
బ్యాంక్ ఆఫ్ ఇండియా సెలెక్టెడ్ టెన్యూర్ రుణాలపై ఐదు బేసిక్ పాయింట్లు ఎంసీఎల్ఆర్ పెంచింది. ఓవర్ నైట్ టెన్యూర్ రుణాలపై 7.95%, ఒక నెల టెన్యూర్ రుణంపై 8.15%. మూడు నెలల టెన్యూర్‌పై 8.35 శాతం, ఆరు నెలల రుణంపై 8.55 శాతం, ఏడాది టెన్యూర్ రుణంపై 8.75 శాతం, మూడేండ్ల టెన్యూర్ లోన్ మీద 8.95% శాతానికి ఎంసీఎల్ఆర్ పెరిగింది.
రుణాలపై బ్యాంక్ ఆఫ్ ఇండియా వడ్డీరేట్లు ఇలా | |
టెన్యూర్ | ఎంసీఎల్ఆర్ |
ఓవర్ నైట్ | 7.95 శాతం |
ఒక నెల | 8.20 శాతం |
3 నెలలు | 8.35 శాతం |
6 నెలలు | 8.55 శాతం |
ఏడాది | 8.75 శాతం |
మూడేండ్లు | 8.95 శాతం |
Home Loans,ICICI Bank,Bank of India,Interest Rates
Home Loans, ICICI Bank, Bank of India, loan rates, interest rate, Business, Business News, Telugu News,. Telugu Global News, ఇండ్ల రుణాలపై వడ్డీరేట్లు, ఐసీఐసీఐ బ్యాంక్, బ్యాంక్ ఆఫ్ ఇండియా
https://www.teluguglobal.com//business/home-loans-icici-bank-bank-of-india-hiked-loan-rates-from-november-1-2023-check-new-rates-971588