https://www.teluguglobal.com/h-upload/2023/09/28/500x300_832205-kia-cars.webp
2023-09-28 11:44:02.0
Hyundai-Kia | దక్షిణ కొరియా ఆటోమొబైల్ దిగ్గజ సంస్థల హ్యండాయ్ మోటార్స్, కియా మోటార్స్ కీలక నిర్ణయం తీసుకున్నాయి. అమెరికాలో తాము విక్రయించిన పలు మోడల్ కార్లు సుమారు 34 లక్షల కార్లు రీకాల్ చేస్తున్నట్లు ప్రకటించాయి.
Hyundai-Kia | దక్షిణ కొరియా ఆటోమొబైల్ దిగ్గజ సంస్థల హ్యండాయ్ మోటార్స్, కియా మోటార్స్ కీలక నిర్ణయం తీసుకున్నాయి. అమెరికాలో తాము విక్రయించిన పలు మోడల్ కార్లు సుమారు 34 లక్షల కార్లు రీకాల్ చేస్తున్నట్లు ప్రకటించాయి. ఆయా కార్ల ఇంజిన్ భాగంలో మంటలు వచ్చే ముప్పు పొంచి ఉందని తెలిపాయి. 2010 నుంచి 2019 మధ్య విక్రయించిన ఆయా మోడల్ కార్లను రీకాల్ చేస్తున్నామని వెల్లడించాయి. వాటిలో హ్యుండాయ్ శాంటా ఎఫ్ఈ ఎస్‌యూవీ, కియా సోరెంటో ఎస్‌యూవీ మోడల్స్ కూడా ఉన్నాయి.
హ్యుండాయ్, కియా మోటార్స్ కార్లలో లాక్ బ్రేక్ కంట్రోల్ మాడ్యూల్‌లో ఫ్లూయిడ్ లీక్ అవుతున్నట్లు ఉందని అమెరికా జాతీయ రహదారుల ట్రాఫిక్ భద్రతా విభాగం బుధవారం హెచ్చరికలు జారీ చేసింది. ఆయా కార్లు డ్రైవింగ్ చేస్తున్నప్పుడు గానీ, పార్కింగ్ చేసినప్పుడు గానీ ఎలక్ట్రిక్ షార్ట్ షర్క్యూట్‌తో మంటలు చెలరేగే అవకాశం ఉందని పేర్కొంది. కనుక ఇంటి బయటే ఆయా కార్లను పార్కింగ్ చేయాలని హితవు చెప్పింది. ఈ నేపథ్యంలో సమస్య ఉన్న కార్లలో యాంటీ లాక్ బ్రేక్ ఫ్యూజ్‌ను ఉచితంగా రీప్లేస్ చేస్తామని హ్యుండాయ్ మోటార్స్, కియా మోటార్స్ ప్రకటించాయి.
నవంబర్ 14 నుంచి తమ కార్లలో యాంటీ లాక్ బ్రేక్ ఫ్యూజ్ రీప్లేస్ చేస్తామని ఆయా కార్ల ఓనర్లకు కియా మోటార్స్ నోటిఫికేషన్ (లేఖలు) పంపనున్నది. హ్యుండాయ్ మోటార్స్ నవంబర్ 21 నుంచి రీప్లేస్ చేస్తామని తెలిపింది. అమెరికాలో 21 హ్యుండాయ్ కార్లలో మంటలు చెలరేగిన ఘటనలు చోటు చేసుకోగా, 22 కార్లలో విడి భాగాలు కరిగిపోయి మంటలు వచ్చిన ఘటనలు జరిగాయి. మరోవైపు 10 కియా కార్లలో మంటలు వచ్చి కరిగిపోయిన ఘటనలు చోటు చేసుకున్నాయి. ఈ నేపథ్యంలో తమ కస్టమర్ల భద్రత కోసమే ఆయా కార్లను రీకాల్ చేస్తున్నట్లు తెలిపాయి. సమస్య తలెత్తిన కార్ల యజమానులు తమ కార్ల సమస్య పరిష్కారం కోసం www.nhtsa.gov/recallsను సందర్శించి 17-అంకెల వెహికల్ ఐడెంటిఫికేషన్ నంబర్ నమోదు చేయాలని సూచించాయి.
కియా రీకాల్ చేసే మోడల్స్ ఇవే..
బొర్రెగో (2010 నుంచి 2019 వరకూ విడుదల చేసిన వివిధ మోడల్స్), కడ్డో (2014 – 2016 మధ్య మార్కెట్‌లో విక్రయించిన వివిధ మోడల్స్), ఫార్టే, ఫార్టే కూపే, స్పొర్టేజ్ (2010 – 2013 మధ్య విక్రయించిన వివిధ మోడల్స్), కే900 (2015 – 2018 మధ్య విడుదల చేసిన కార్లు), ఒప్టిమా (2011 – 2015 మధ్య విక్రయించిన కార్లు), ఒప్టిమా హైబ్రీడ్, సౌల్ (2011 నుంచి 2013 వరకూ విడుదల చేసిన కార్లు), రియో (2012 నుంచి 2017 వరకూ తయారైన వివిధ మోడల్స్), సోరెంటో (2011 నుంచి 2014 వరకూ విక్రయించిన కార్లు), రొండో (2010 నుంచి 2011 వరకూ విక్రయించిన కార్లు).
హ్యుండాయ్ రీకాల్ చేసే కార్లివే..
ఎలంత్రా, జెనిసిస్ కూపే, సొనాటా హైబ్రీడ్ (2011 నుంచి 2015 వరకూ విక్రయించిన మోడల్స్), ఎక్స్‌సెంట్, అజెరా, వెలోస్టర్ (2012 నుంచి 2015 వరకూ విక్రయించిన కార్లు), ఎలంత్రా కూపే, శాంటా ఎఫ్ఈ (2013 నుంచి 2015 వరకు విక్రయించిన మోడల్ కార్లు), ఈక్వస్ (2014 నుంచి 2015 వరకూ విక్రయించిన కార్ల మోడల్స్), వెరాక్రజ్ (2010 నుంచి 2012 వరకూ విక్రయించిన వివిధ మోడల్ కార్లు), తుషా (2010 నుంచి 2013 వరకూ విక్రయించిన కార్లు), 2015 తుషా ఫ్యుయల్ సెల్, 2013 శాంతా ఎఈ స్పోర్ట్ మోడల్ కార్లు.
Kia Motors,Hyundai,Car Recall Notices,America
Hyundai, Kia motors, Hyundai recalls its cars, Kia motors recalls its cars, why hyundai recalled its car, how to replace hyundai cars, why kia cars replace, ways to replace kia car, how to register for kia car replacement, car fire, kia car fire incident, hyundai car fire, Telugu News, Telugu Global News, హ్యండాయ్ మోటార్స్, కియా మోటార్స్
https://www.teluguglobal.com//business/hyundai-and-kia-recalled-34-lakh-cars-in-america-964404