iPhone with Gold | ప‌సిడితో ఐ-ఫోన్‌15 సిరీస్ ఫోన్లు.. సెల‌బ్రిటీల కోసం ఇలా.. లిమిటెడ్ ఆఫ‌ర్ ఓన్లీ..!

https://www.teluguglobal.com/h-upload/2023/09/26/500x300_830856-iphone-gold.webp

2023-09-26 06:45:54.0

iPhone with Gold | గ్లోబ‌ల్ టెక్ దిగ్గ‌జం ఆపిల్ ఈ నెల 12న త‌న ఐ-ఫోన్ 15 (iPhone 15) సిరీస్ ఫోన్లు ఆవిష్క‌రించింది. వాటిలో ఐ-ఫోన్ 15 (iPhone 15), ఐ-ఫోన్ 15 ప్ల‌స్ (iPhone 15 Plus), ఐ-ఫోన్ 15 ప్రో (iPhone 15 Pro), ఐ-ఫోన్ 15 ప్రో మ్యాక్స్ (iPhone 15 Pro Max) ఫోన్లు ఉన్నాయి.

iPhone with Gold | గ్లోబ‌ల్ టెక్ దిగ్గ‌జం ఆపిల్ ఈ నెల 12న త‌న ఐ-ఫోన్ 15 (iPhone 15) సిరీస్ ఫోన్లు ఆవిష్క‌రించింది. వాటిలో ఐ-ఫోన్ 15 (iPhone 15), ఐ-ఫోన్ 15 ప్ల‌స్ (iPhone 15 Plus), ఐ-ఫోన్ 15 ప్రో (iPhone 15 Pro), ఐ-ఫోన్ 15 ప్రో మ్యాక్స్ (iPhone 15 Pro Max) ఫోన్లు ఉన్నాయి. వాటిలో దుబాయ్ కేంద్రంగా ప‌ని చేస్తున్న ల‌గ్జ‌రీ బ్రాండ్ కేవియ‌ర్ (Caviar).. ఐ-ఫోన్ 15 ప్రో (iPhone 15 Pro), ఐ-ఫోన్ 15 ప్రో మ్యాక్స్ (iPhone 15 Pro Max) ఫోన్ల‌ను బంగారంతో త‌యారుచేసింది. ఐ-ఫోన్ 15 ప్రో మోడ‌ల్స్‌లో చేసిస్‌ను బంగారంతో త‌యారు చేసింది. ఆల్ట్రా గోల్డ్ త‌దిత‌ర ఐదు మోడ‌ల్స్‌లో ప‌రిమితంగా వీటిని త‌యారు చేసింది.

ఐఫోన్ 15 ప్రో (iPhone 15 Pro), ఐఫోన్ 15 ప్రో మ్యాక్స్ (iPhone 15 Pro Max) ఫోన్లు.. స‌ద‌రు ఐదు వేరియంట్ల‌లో 99 యూనిట్ల చొప్పున త‌యారు చేసింది. ఆల్ట్రా గోల్డ్‌, ఆల్ట్రా బ్లాక్‌, టైటాన్ బ్లాక్‌, స్టారీ నైట్‌, డార్క్ రెడ్ వేరియంట్ల‌లో త‌యారు చేసింది. సాధార‌ణంగా ఐ-ఫోన్ 15 ప్రో (iPhone 15 Pro) ఫోన్ ధ‌ర రూ.1,34,900, ఐ-ఫోన్ 15 ప్రో మ్యాక్స్ (iPhone 15 Pro Max) ఫోన్ రూ.1,59,900 నుంచి ప్రారంభ‌మ‌వుతుంది. దుబాయ్ ల‌గ్జ‌రీ బ్రాండ్ `కేవియ‌ర్ (Caviar) త‌యారు చేసిన ఐ-ఫోన్ 15 ప్రో (iPhone 15 Pro) ఫోన్ ధ‌ర రూ.6,11,161, ఐ-ఫోన్ 15 ప్రో మ్యాక్స్ (iPhone 15 Pro Max) ఫోన్ రూ. 8,65,241 నుంచి మొద‌ల‌వుతుంది.

ఐఫోన్ మోడ‌ల్ ———– —— ———– డాల‌ర్ల‌లో ధ‌ర (రూపాయిల్లో ధ‌ర‌)

ఐఫోన్ 15 ప్రో (ఆల్ట్రా గోల్డ్) ——– —— $8,890 (రూ.7,40,144.06)

ఐఫోన్ 15 ప్రో మ్యాక్స్ (అల్ట్రా గోల్డ్‌) —— $9,670 (రూ.8,05,083.59)

ఐఫోన్ 15 ప్రో (ఆల్ట్రా బ్లాక్‌) ——- ——– $8,060 (రూ. 6,71,041.75)

ఐఫోన్ 15 ప్రో మ్యాక్స్ (ఆల్ట్రా బ్లాక్‌) —— $8,840 (రూ.7,35,981.27)

ఐఫోన్ 15 ప్రో (టైటాన్ బ్లాక్) —— ——– $7,410 (రూ. 6,16,925.48)

ఐఫోన్ 15 ప్రో మ్యాక్స్ (టైటాన్ బ్లాక్) —– $8,200 (రూ.6,82,697.56)

ఐఫోన్ 15 ప్రో (స్టారీ నైట్) —– —- ——- $7,340 (రూ.6,11,097.57)

ఐఫోన్ 15 ప్రో మ్యాక్స్ (స్టారీ నైట్‌) ——– $8,130 (రూ. 6,76,869.65)

ఐఫోన్ 15 ప్రో (డార్క్ రెడ్‌) —— — —— $7,340 (రూ. 6,11,097.57)

ఐఫోన్ 15 ప్రో మ్యాక్స్ (డార్క్ రెడ్‌) ——- $8,130 (రూ.6,76,869.65)

కేవియ‌ర్ త‌యారు చేసిన ఆల్ట్రా గోల్డ్- ఐఫోన్ 15 ప్రో సిరీస్ ఫోన్ల‌లో శాటిన్ ఫినిష్‌తోపాటు 18 క్యార‌ట్ల బంగారం చేసిస్‌తో త‌యారుచేసింది. బ్యాక్‌లో ఉండే ఆపిల్ లోగో 24 క్యార‌ట్ల బంగారంతో త‌యారు చేసింది. సెల‌బ్రిటీలు, అథ్లెట్లు, రాజ‌కీయ‌వేత్త‌లు, ప్ర‌ముఖ వ్య‌క్తుల కోసం కేవియ‌ర్ డిజైన్ చేసి త‌యారు చేసింది. ఆల్ట్రా బ్లాక్ వేరియంట్లుగా ఐ-ఫోన్ 15 ప్రో (iPhone 15 Pro), ఐ-ఫోన్ 15 ప్రో మ్యాక్స్ (iPhone 15 Pro Max) మోడ‌ల్స్ వెనుక 24 క్యార‌ట్ల బంగారంతో ఆపిల్ లోగో రూపుదిద్దుకున్న‌ది. స్పెష‌ల్ పీవీడీ కోటింగ్‌తో కూడి ఏవియేష‌న్ గ్రేడ్ టైటానియంతో కూడిన ఫ్రేమ్‌ను త‌యారు చేసింది.

iPhone,iPhone 15,iPhone with Gold,Iphone 15 Plus,iPhone 15 Pro,Iphone 15 Pro Max,Caviar

https://www.teluguglobal.com//science-tech/limited-edition-iphone-15-pro-iphone-15-pro-max-with-18k-gold-chassis-launched-by-caviar-963875