iQoo 12 Pro BMW M | మోటార్ స్పోర్ట్ ఎడిష‌న్ ఐక్యూ12 ప్రో బీఎండ‌బ్ల్యూ ఎం ఫోన్ ఆవిష్క‌ర‌ణ‌కు ముహూర్తం ఖ‌రారు.. ఎప్పుడంటే..?!

https://www.teluguglobal.com/h-upload/2023/10/29/500x300_847926-iqoo-12-pro.webp

2023-10-29 07:22:15.0

iQoo 12 Pro BMW M | ప్ర‌ముఖ చైనా స్మార్ట్ ఫోన్ల త‌యారీ సంస్థ ఐక్యూ (iQoo) త‌న ఐక్యూ12 ప్రో బీఎంబ్ల్యూ ఎం (iQoo 12 Pro BMW M) మోటార్ స్పోర్ట్ ఎడిష‌న్ ఆవిష్క‌ర‌ణ‌కు ముహూర్తం ఖ‌రారైంది.

iQoo 12 Pro BMW M | ప్ర‌ముఖ చైనా స్మార్ట్ ఫోన్ల త‌యారీ సంస్థ ఐక్యూ (iQoo) త‌న ఐక్యూ12 ప్రో బీఎంబ్ల్యూ ఎం (iQoo 12 Pro BMW M) మోటార్ స్పోర్ట్ ఎడిష‌న్ ఆవిష్క‌ర‌ణ‌కు ముహూర్తం ఖ‌రారైంది. ఐక్యూ12 ప్రో బీఎండ‌బ్ల్యూ ఎం ఫోన్ మోటార్స్ స్పోర్ట్ ఎడిష‌న్ డిజైన్ క‌లిగి ఉంటుంది. న‌వంబ‌ర్ ఏడో తేదీన భార‌త్ మార్కెట్లో ఆవిష్క‌ర‌ణ‌కు రంగం సిద్ధ‌మైంది. ఐక్యూ 12 (iQoo 12)తోపాటు ఐక్యూ12 ప్రో (iQoo 12 Pro), ఐక్యూ12 ప్రో బీఎండ‌బ్ల్యూ ఎం ((iQoo 12 Pro BMW M) ఫోన్లు కూడా ఆవిష్క‌రిస్తారు.

ఐక్యూ బీఎండ‌బ్ల్యూ ఎం (iQoo 12 Pro BMW M) మోటార్ స్పోర్ట్ ఎడిష‌న్ ఫోన్.. బీఎండ‌బ్ల్యూ చిన్న‌చార‌ల (బ్లూ, బ్లాక్‌, రెడ్‌)తో వైట్ క‌ల‌ర్ ఆప్ష‌న్‌తో వ‌స్తోంది. ట్రిపుల్ రేర్ కెమెరా యూనిట్ క‌లిగి ఉంటుంది. ఐక్యూ12 ప్రో ఫోన్ రౌండెడ్ ఎడ్జెస్‌తో స్వ‌ల్పంగా రైజ్డ్ రెక్టాంగుల‌ర్ కెమెరా మాడ్యూల్‌తో వ‌స్తున్న‌ది. వ‌ర్టిక‌ల్ ఫ్యాష‌న్‌లో ఔట్‌సైడ్ కెమెరాపై ఎల్ఈడీ ఫ్లాష్ యూనిట్ జ‌త చేశారు.

పెరిస్కోప్ టెలిఫొటో లెన్స్‌తో ఐక్యూ12 ప్రో (iQoo 12 Pro) ఫోన్ 64-మెగా పిక్సెల్ ఓమ్నీ విజ‌న్ ఓవీ64బీ సెన్సార్ కెమెరా వ‌స్తుంది. ఈ కెమెరాతో లెన్స్‌ 3ఎక్స్ ఆప్టిక‌ల్ జూమ్‌, 100 ఎక్స్ వ‌ర‌కూ డిజిట‌ల్ జూమ్ చేయొచ్చు. వీటితోపాటు ఓమ్నీ విజ‌న్ ఓవీ 50 హెచ్ సెన్స‌ర్‌, శాంసంగ్ ఐఎస్‌వోసెల్ జేఎన్ 1 సెన్స‌ర్ విత్ 15 ఎంఎం ఆల్ట్రావైడ్ లెన్స్ కెమెరా ఉంటాయి.

ఐక్యూ12 ప్రోతోపాటు ఐక్యూ12 సిరీస్ ఫోన్లు న్యూ జ‌న‌రేష‌న్ క్వాల్‌కామ్ స్నాప్ డ్రాగ‌న్ 8 జెన్ 3 ఎస్వోసీ (Qualcomm Snapdragon 8 Gen 3 SoC) చిప్‌సెట్‌తో వ‌స్తుంద‌ని ఇంత‌కుముందే కంపెనీ ధృవీక‌రించింది. ఈ సంగ‌తి ఐక్యూ ఇండియా సీఈఓ నిపుణ్ మౌర్య ఇప్ప‌టికే సంకేతాలిచ్చారు.

శాంసంగ్ ఈ7 అమోలెడ్ డిస్‌ప్లే విత్ 2కే రిజొల్యూష‌న్ క‌లిగి ఉంటుంది. ప‌బ్జీ మొబైల్‌, ప‌బ్జీ న్యూ స్టేట్‌, జెన్సిన్ ఇంపాక్ట్‌, లీగ్ ఆఫ్ లెజెండ్స్ మొబైల్ త‌దిత‌ర గేమ్స్‌కు మ‌ద్ద‌తుగా మెరుగైన గేమింగ్ గ్రాఫిక్స్ పొంద‌డానికి వీలుగా డిస్‌ప్లే ఉంటుంది. సెక‌న్‌కు 144 ఫ్రేమ్స్ పొందొచ్చున‌ని ఐక్యూ చెబుతోంది.

ఐక్యూ12 5జీ (iQoo 12) ఫోన్ 120వాట్ల వైర్డ్ ఫాస్ట్ చార్జింగ్ మ‌ద్దతుతో 4,880 ఎంఏహెచ్ కెపాసిటీ గ‌ల బ్యాట‌రీ క‌లిగి ఉంటుంద‌ని భావిస్తున్నారు. మ‌రోవైపు ఐక్యూ12 ప్రో (iQoo 12 Pro) ఫోన్ 120 వాట్ల వైర్డ్ ఫాస్ట్ చార్జింగ్ లేదా 50 వాట్ల వైర్‌లెస్ చార్జింగ్ స‌పోర్ట్‌తో 4,980 ఎంఏహెచ్ కెపాసిటీ గ‌ల బ్యాట‌రీతో వ‌స్తుంద‌ని అంచ‌నా వేస్తున్నారు.

iQoo 12 Pro,iQoo,iQoo 12 Pro BMW M,Smartphone

https://www.teluguglobal.com//science-tech/iqoo-12-pro-bmw-m-motorsport-edition-design-revealed-ahead-of-november-7-launch-970740