iQoo 12 Series | స్నాప్‌డ్రాగ‌న్ 8 జెన్‌3 ఎస్వోసీతో వ‌స్తున్న తొలి ఫోన్ ఇదే.. ఇవీ డిటైల్స్‌..!

https://www.teluguglobal.com/h-upload/2023/10/26/500x300_846421-iqoo-12.webp

2023-10-26 05:39:58.0

iQoo 12 Series | ప్ర‌ముఖ స్మార్ట్ ఫోన్ల త‌యారీ సంస్థ వివో (Vivo) స‌బ్ బ్రాండ్‌ ఐక్యూ (iQoo) త‌న ఐక్యూ12 సిరీస్ (iQoo 12 Series) ఫోన్లను వ‌చ్చేనెల ఏడో తేదీన చైనా మార్కెట్‌లో ఆవిష్క‌రించ‌నున్న‌ది.

iQoo 12 Series | ప్ర‌ముఖ స్మార్ట్ ఫోన్ల త‌యారీ సంస్థ వివో (Vivo) స‌బ్ బ్రాండ్‌ ఐక్యూ (iQoo) త‌న ఐక్యూ12 సిరీస్ (iQoo 12 Series) ఫోన్లను వ‌చ్చేనెల ఏడో తేదీన చైనా మార్కెట్‌లో ఆవిష్క‌రించ‌నున్న‌ది. డిసెంబ‌ర్‌లో భార‌త్ మార్కెట్‌లో ఆవిష్క‌రిస్తార‌ని స‌మాచారం. క్వాల్ కామ్ స్నాప్ డ్రాగ‌న్ 8 జెన్ 3 ఎస్వోసీ చిప్ సెట్ (Qualcomm Snapdragon 8 Gen 3 SoC) టెక్నాల‌జీతో వ‌స్తున్న తొలి స్మార్ట్ ఫోన్ ఐక్యూ12 (iQoo 12), ఐక్యూ 12 ప్రో (iQoo 12 Pro). భార‌త్ మార్కెట్లోకి క్వాల్‌కామ్ న్యూ జ‌న‌రేష‌న్ ఎస్వోసీతో వ‌స్తున్న తొలి స్మార్ట్ ఫోన్ ఇదేన‌ని ఐక్యూ ఇండియా సీఈఓ నిపుణ్ మౌర్య సంకేతాలిచ్చారు.

ఆండ్రాయిడ్ 14 వ‌ర్ష‌న్‌పై ఐక్యూ 12 (iQoo 12), ఐక్యూ 12 ప్రో (iQoo 12 Pro) ప‌ని చేస్తాయ‌ని భావిస్తున్నారు. ట్రిపుల్ రేర్ కెమెరా యూనిట్‌తో ఐక్యూ12, ఐక్యూ 12 ప్రో ఫోన్లు వ‌స్తాయ‌ని స‌మాచారం. అంతేకాదు.. స్నాప్‌డ్రాగ‌న్ స‌మ్మిట్‌లో ఈ ఫోన్ ఆవిష్క‌రించ‌నున్నారు. గ‌రిష్టంగా 3.3 గిగా హెర్ట్జ్ క్లాక్ స్పీడ్‌తో ప‌ని చేసే సామ‌ర్థ్యం గ‌ల ప్రైమ్ కోర్‌తో సీపీయూ ఉంటుంద‌ని స‌మాచారం. వై-ఫై 7, డ్యూయ‌ల్ బ్లూటూత్‌కు మ‌ద్ద‌తుగా నిలుస్తుంది. మెరుగైన గేమింగ్ గ్రాఫిక్స్ కోసం ఐక్యూ 12 (iQoo 12) ఫోన్‌లో డెడికేటెడ్ డిస్‌ప్లే ప్రాసెస‌ర్ విత్‌ హార్డ్‌వేర్ యాక్సిల‌రేటెడ్ రే ట్రేసింగ్ ఉంటుంది. ప‌బ్జీ మొబైల్‌, ప‌బ్జీ న్యూ స్టేట్, గెన్సిన్ ఇంపాక్ట్‌, ఎల్వోఎల్ మొబైల్ త‌దిత‌ర గేమ్స్ ఆడేందుకు ఐక్యూ 12 ఫోన్‌లు ఉంటాయని తెలుస్తున్న‌ది.

ఐక్యూ12 (iQoo 12), ఐక్యూ12 ప్రో (iQoo 12 Pro) ఫోన్లు 24జీబీ ర్యామ్ విత్ ఒక టిగా బైట్ స్టోరేజీ కెపాసిటీ క‌లిగి ఉంటాయ‌ని తెలుస్తున్న‌ది. శాంసంగ్ ఈ7 అమోలెడ్ డిస్‌ప్లే విత్ 2కే రిజొల్యూష‌న్ అండ్ 144 హెర్ట్జ్ రీఫ్రెష్ రేట్ క‌లిగి ఉంటుంది. ఐక్యూ 12 (iQoo 12) సిరీస్ ఫోన్ల‌లో ట్రిపుల్ రేర్ కెమెరా సెట‌ప్ ఉంటుంది. 50- మెగా పిక్సెల్ ఓమ్నీ విజ‌న్ ఓవీ50 హెచ్ సెన్స‌ర్ విత్ ఆప్టిక‌ల్ ఇమేజ్ స్టెబిలైజేష‌న్ (ఓఐఎస్‌), 50- మెగా పిక్సెల్ శాంసంగ్ ఐసోసెల్ జేఎన్ 1 సెన్స‌ర్ విత్ ఆల్ట్రా వైడ్ యాంగిల్ లెన్స్‌, 64-మెగా పిక్సెల్ ఓవీ64బీ టెలిఫోటో సెన్స‌ర్ విత్ 3 ఎక్స్ జూమ్ విత్‌ ఓఐఎస్ స‌పోర్ట్ క‌లిగి ఉంటాయి.

ఐక్యూ 12 ఫోన్ (iQoo 12) ఫోన్ 120 వాట్ల ఫాస్ట్ చార్జింగ్ మ‌ద్ద‌తుతో 4,880 ఎంఏహెచ్ డ్యుయ‌ల్ సెల్ బ్యాట‌రీ, ఐక్యూ 12 ప్రో (iQoo 12 Pro ) ఫోన్ 120 వాట్ల ఫాస్ట్ చార్జింగ్ లేదా 50 వాట్ల వైర్‌లెస్ చార్జింగ్ మ‌ద్ద‌తుతో 4,980 ఎంఏహెచ్ కెపాసిటీ గ‌ల బ్యాట‌రీతో వ‌స్తుంది.

iQoo 12 Series,iQoo 12,iQoo,Smartphone

https://www.teluguglobal.com//science-tech/iqoo-12-series-launch-set-for-november-7-confirmed-to-run-on-snapdragon-8-gen-3-soc-970141