iQoo Z9 5G | మార్చి 12న భార‌త్ మార్కెట్‌లోకి ఐక్యూ జ‌డ్‌9 5జీ ఫోన్‌.. ధ‌రెంతో తెలుసా..?!

2024-03-10 04:04:56.0

iQoo Z9 5G | ప్ర‌ముఖ స్మార్ట్ ఫోన్ల త‌యారీ సంస్థ ఐక్యూ (iQoo) త‌న ఐక్యూ జ‌డ్‌9 5జీ (iQoo Z9 5G) ఫోన్‌ను భార‌త్ మార్కెట్‌లో ఆవిష్క‌రించేందుకు ముహూర్తం ఖ‌రారైంది.

iQoo Z9 5G | ప్ర‌ముఖ స్మార్ట్ ఫోన్ల త‌యారీ సంస్థ ఐక్యూ (iQoo) త‌న ఐక్యూ జ‌డ్‌9 5జీ (iQoo Z9 5G) ఫోన్‌ను భార‌త్ మార్కెట్‌లో ఆవిష్క‌రించేందుకు ముహూర్తం ఖ‌రారైంది. ఈ నెల 12న ఐక్యూ జ‌డ్‌9 5జీ (iQoo Z9 5G) ఫోన్‌ను భార‌త్ మార్కెట్‌లో ఆవిష్క‌రిస్తామ‌ని ఐక్యూ ఇండియా వెబ్‌సైట్‌, ఈ-కామ‌ర్స్ ప్లాట్‌ఫామ్ అమెజాన్ మైక్రోసైట్ వెల్ల‌డించింది.

ఐక్యూ జ‌డ్‌9 5జీ (iQoo Z9 5G) ఫోన్ గ్రాఫెన్ బ్లూ (Graphene Blue), బ్ర‌ష్డ్ గ్రీన్ (Brushed Green) క‌ల‌ర్ ఆప్ష‌న్ల‌లో ల‌భిస్తుంది. ఈ ఫోన్ మీడియాటెక్ డైమెన్సిటీ 7200 ఎస్వోసీ చిప్‌సెట్‌తో వ‌స్తుంది. 300 హెర్ట్జ్ ట‌చ్ శాంప్లింగ్ రేట్‌, 120 హెర్ట్జ్ రీఫ్రెష్ రేటుతో వ‌స్తున్న ఐక్యూ జ‌డ్‌9 5జీ ఫోన్ అమోలెడ్ డిస్‌ప్లే క‌లిగి ఉంటుంది. 1800 నిట్స్ పీక్ బ్రైట్‌నెస్‌తో వ‌స్తోంది.

ఐక్యూ జ‌డ్‌9 5జీ (iQoo Z9 5G) ఫోన్ డ్యుయ‌ల్ స్టీరియో స్పీక‌ర్లు, 5000 ఎంఏహెచ్ కెపాసిటీ గ‌ల బ్యాట‌రీతో వ‌స్తుంది. ఈ ఫోన్ 7.83 ఎంఎం థిక్‌నెస్‌తో అందుబాటులో ఉంటుంది. ఆప్టిక‌ల్ ఇమేజ్ స్టెబిలైజేష‌న్ (ఓఐఎస్‌) మ‌ద్ద‌తుతో 50-మెగా పిక్సెల్ సోనీ ఐఎంఎక్స్‌882 ప్రైమ‌రీ సెన్స‌ర్‌తో కూడిన డ్యుయ‌ల్ రేర్ కెమెరా సెట‌ప్ క‌లిగి ఉంటుంది. ఐక్యూ జ‌డ్‌9 5జీ (iQoo Z9 5G) ఫోన్ 8 జీబీ ర్యామ్ విత్ 128 జీబీ స్టోరేజీ వేరియంట్ రూ.17,999, 8 జీబీ స్టోరేజీ వేరియంట్ రూ.19,999ల‌కు ల‌భిస్తాయి. ఐక్యూ ఇండియా వెబ్‌సైట్‌, అమెజాన్ ద్వారా దేశీయ మార్కెట్‌లో విక్ర‌యిస్తారు.

ఐ క్యూ జ‌డ్‌9 5జీ (iQoo Z9 5G) ఫోన్‌ను ఈ నెల 14 నుంచి అమెజాన్‌లో విక్ర‌యిస్తారు. ఈ నెల 12న మార్కెట్‌లో ఆవిష్క‌రించిన త‌ర్వాత అమెజాన్ ప్రైమ్ యూజ‌ర్లు ఈ నెల 13వ తేదీ మ‌ధ్యాహ్నం 12 గంట‌ల‌ నుంచే బుక్ చేసుకోవ‌చ్చు. ఐసీఐసీఐ బ్యాంక్‌, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంకు కార్డుల‌పై కొనుగోలు చేసే వారికి రూ.2000 ఇన్‌స్టంట్ డిస్కౌంట్ ల‌భిస్తుంది. మూడు నెల‌ల వ‌ర‌కూ కొనుగోలు దారుల‌కు నో-కాస్ట్ ఈఎంఐ ఆప్ష‌న్ కూడా అందుబాటులో ఉంది.

iQoo,iQoo Z9 5G,Smartphone