2024-06-05 17:13:57.0
https://www.teluguglobal.com/h-upload/2024/06/05/1334009-kalki-poster-1.webp
Kalki Movie Trailer – కల్కి మూవీ ట్రయిలర్ రెడీ అయింది. 10వ తేదీ నుంచి సందడి చేయనుంది.
ప్రభాస్ హీరోగా నటిస్తున్న మోస్ట్ ఎవెయిటింగ్ మూవీ కల్కి విడుదలకు సిద్ధమైంది. ఈ సినిమా ప్రచారాన్ని మరింత ముందుకు తీసుకెళ్తూ, ట్రయిలర్ రిలీజ్ డేట్ ను ఎనౌన్స్ చేశారు. 10వ తేదీన కల్కి ట్రయిలర్ రిలీజ్ అవుతుంది.
రిలీజ్ డేట్ ఎనౌన్స్ మెంట్ సందర్భంగా మరో పోస్టర్ రిలీజ్ చేశారు మేకర్స్. భైరవ పాత్రధారి ప్రభాస్, పర్వత శిఖరంపై నిల్చొని పైకి చూస్తున్న స్టిల్ ను పోస్టర్ గా వదిలారు. ప్రతిది మార్పునకు మూలం అనే ట్యాగ్ లైన్ ను కూడా యాడ్ చేశారు.
భారీ తారాగణంతో తెరకెక్కుతోంది కల్కి సినిమా. సినిమాలో ప్రభాస్ సరసన దీపిక పదుకోన్, దిశా పటానీ హీరోయిన్లుగా నటిస్తున్నారు. బిగ్ బి అమితాబ్ బచ్చన్ కీలక పాత్ర పోషిస్తుండగా, విలన్ గా లెజెండ్ కమల్ హాసన్ కనిపించనున్నారు. అందుకే ఈ ప్రాజెక్టుకు మరింత క్రేజ్ పెరిగింది.
వైజయంతీ మూవీస్ బ్యానర్ పై అశ్వనీదత్ నిర్మిస్తున్న ఈ సినిమాకు నాగ్ అశ్విన్ దర్శకుడు. దాదాపు 300 కోట్ల రూపాయల బడ్జెట్ తో ఈ సినిమా తెరకెక్కుతున్నట్టు తెలుస్తోంది. సంతోష్ నారాయణన్ ఈ సినిమాకు సంగీతం అందిస్తున్నాడు.

Prabhas,kalki movie,kalki movie trailer review,Deepika padukone